మాస్ మహారాజ్తో తాన్య..!

12 Sep, 2017 15:29 IST|Sakshi
మాస్ మహారాజ్తో తాన్య..!

లాంగ్ గ్యాప్ తరువాత వరుస సినిమాలకు కమిట్ అవుతున్న మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. పటాస్ ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా ది గ్రేట్ షూటింగ్ ఇప్పటికే పూర్తి కావచ్చింది. ఈ సినిమాతో పాటు టచ్ చేసి చూడు సినిమా షూటింగ్లో  బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత ఓ తమిళ సినిమా రీమేక్కు రెడీ అవుతున్నాడు రవితేజ.

కోలీవుడ్లో ఘనవిజయం సాధించిన భోగన్ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నాడు. ఒరిజినల్ వర్షన్కు దర్శకత్వం వహించిన లక్ష్మణ్ తెలుగు వర్షన్ దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకున్నాడు. ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉన్న ఈ సినిమాలో లీడ్ హీరోయిన్గా కేథరిన్ థెరిస్సా నటిస్తుండగా మరో కీలక పాత్రలో అప్పట్లో ఒకడుండేవాడు ఫేం తాన్య హోప్ నటించనుంది. అక్టోబర్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.