శశికుమార్‌కు జంటగా తాన్యా

7 Oct, 2016 02:12 IST|Sakshi
శశికుమార్‌కు జంటగా తాన్యా

 నటుడు శశికుమార్‌కు జంటగా నాటి సూపర్‌స్టార్ రవిచంద్రన్ మనవరాలు తాన్యా నటించనున్నారని తాజా సమాచారం. 1960-70 దశకంలో తమిళ చిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్‌గా వెలుగొందిన నటుడు రవిచంద్రన్. ఈయన వారసుడు హంసవర్దన్ హీరోగా తెరంగేట్రం చేసినా నిలదొక్కుకోలేకపోయారు. కాగా తాజాగా రవిచంద్రన్ మనవరాలు తాన్యా నాయకిగా రంగప్రవేశం చేశారు. ఇప్పటికే రెండు చిత్రాల్లో నాయకిగా నటిస్తున్నారు.
 
 రాధామోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బృందావనం చిత్రంలో అరుళ్‌నిధికి జంటగా తాన్యా నటిస్తున్నారు. అదే విధంగా మిష్కిన్ దర్శకత్వంలో విశాల్ సరసన నాయకిగా నటిస్తున్నారు. తాజాగా శశికుమార్‌తో జత కట్టడానికి సిద్ధమవుతున్నారు. కిడారి వంటి విజయవంతమైన చిత్రం తరువాత శశికుమార్ తదుపరి చిత్రానికి రెడీ అయ్యారు. తన సొంత సంస్థ కంపెనీ పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు ప్రకాశ్ పరిచయం కానున్నారు.
 
 ఇందులో శశికుమార్‌కు జంటగా తాన్యాను ఎంపిక చేశారన్నది తాజా సమాచారం. పూర్తి వినోదభరిత చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో నటి కోవైసరళ, సంగిలి మురుగన్ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. దీనికి అలప్పారై అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తెలిసింది.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి