నేను జాలీ టైప్

2 Aug, 2013 02:10 IST|Sakshi
నేను జాలీ టైప్
 నన్ను చూస్తే చాలామంది చాలా గంభీరమైన అమ్మాయి అని అనుకుంటారు, నిజానికి నేను చాలా జాలీ టైప్ అంటోంది నటి తాప్సీ. చాలా కాలంగా ఎదురుచూస్తున్న విజయం ఆమెను ఇటీవల తెలుగు చిత్రం సాహసం ద్వారా వరించింది. దీంతో పట్టరాని ఆనందంతో ఎగిరి గంతేస్తున్న తాప్సీ అలాంటి సక్సెస్‌ను కోలీవుడ్‌లో ఆకాంక్షిస్తోంది. ఆ కోరికను గంగ తీర్చుతుందనే ఆశాభావంతో ఉంది. మధ్యలో ఈ గంగ ఎవరని అనుకుంటున్నారా? ప్రముఖ కొరియోగ్రాపర్, దర్శక, నటుడు లారెన్స్ తెరకెక్కిస్తున్న ముని-3 చిత్రమే ఈ గంగ. మునికి సీక్వెల్‌గా వచ్చిన కాంచన మం చి విజయాన్ని సాధించడంతో దానికి మూడవ భాగాన్ని రూపొందిస్తున్నారు. 
 
 ఇది తమిళ, తెలు గు, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. రెట్టింపు ఉత్సాహంతో ఉన్న తాప్సీ అజిత్ హీరోగా నటిస్తున్న ఆరంభం చిత్రంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ సందర్భంగా ఆమె తన మనసులోని కోరికను బయట పెట్టిం ది. ‘నేను చాలా తుంటరిని. షూటింగ్ స్పాట్‌లో ఇతరులను జోక్స్‌తో ఆట పట్టించే తీరు చూస్తే నేనెంత అల్లరి అమ్మాయినో తెలుస్తుంది. హాస్యమంటే చాలా ఇష్టం. అలాంటి మంచి హాస్య పాత్ర ల్లో నటించాలని ఆశగా ఉంది. కానీ ఎవరూ అలాంటి పాత్ర లు ఇవ్వడం లేదు’ అని అంటున్న తాప్సీ హైదరాబాదులో సొంతంగా ఇల్లు ఏర్పరచుకుంది.