బిజీ తాప్సీ

30 Nov, 2019 05:50 IST|Sakshi

హిందీ చిత్రపరిశ్రమలో కథానాయిక తాప్సీ స్పీడ్‌ మామూలుగా లేదు. ఆమె ఒప్పుకుంటున్న సినిమాలను గమనిస్తుంటే వచ్చే ఏడాది తాప్సీ డైరీ ఫుల్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘థప్పడ్, రష్మి: ద రాకెట్‌’ చిత్రాలతో బిజీగా ఉన్నారు తాప్సీ. ఇటీవల అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వంలో ఓ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీ చేయబోతున్నట్లు తెలిపారు. కథ నచ్చడంతో తాజాగా మరో హిందీ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారామె. యాడ్‌ ఫిల్మ్స్‌ నుంచి డైరెక్టర్‌గా మారి, 2014లో ‘హసీ తో ఫసీ’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన వినిల్‌ మాథ్యూ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. రొమాంటిక్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో తాప్సీ సరసన విక్రాంత్‌ మాస్సే నటిస్తారు. భూషణ్‌ కుమార్, ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ నిర్మాతలు. ఈ సినిమా చిత్రీకరణ జనవరిలో ప్రారంభం కానుంది. ఈ సినిమానే కాకుండా ఓ లేడీ ఓరియంటెడ్‌ సినిమా చేయడానికి తాప్సీ కథలు వింటున్నారని తాజా సమాచారం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘లాక్‌డౌన్‌ కష్టంగా ఉందా.. ఈ వీడియో చూడు’

‘మహానుభావుడు’ అప్పట్లోనే చెప్పాడు!!

క‌రోనా వ‌ల్ల ఓ మంచి జ‌రిగింది: న‌టుడు

అను, అర్జున్‌ల పరిచయం అదిరింది

అంత పెద్ద మొత్తం ఇస్తానన్నపుడు.. : ట్వింకిల్‌

సినిమా

‘లాక్‌డౌన్‌ కష్టంగా ఉందా.. ఈ వీడియో చూడు’

‘మహానుభావుడు’ అప్పట్లోనే చెప్పాడు!!

క‌రోనా వ‌ల్ల ఓ మంచి జ‌రిగింది: న‌టుడు

అను, అర్జున్‌ల పరిచయం అదిరింది

అంత పెద్ద మొత్తం ఇస్తానన్నపుడు.. : ట్వింకిల్‌

కరోనా ఎఫెక్ట్‌: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నితిన్‌