దెయ్యాలు భయపడితే!

16 Dec, 2016 23:39 IST|Sakshi
దెయ్యాలు భయపడితే!

హారర్‌ ప్లస్‌ కామెడీ... నటీనటులకు మాంచి విజయాలు అందిస్తూ, దర్శక–నిర్మాతలకు కాసులు కురిపిస్తున్న హిట్‌ ఫార్ములా ఇది. ఇప్పుడు ఢిల్లీ భామ తాప్సీ కూడా ఇటువంటి తెలుగు సినిమాలో నటించనున్నారు. కానీ, ఆమె చేయబోయేది కామెడీ హారర్‌ సినిమా. మాములుగా మనోళ్లు ‘హారర్‌ కామెడీ’ అంటుంటారు కదా.. రివర్స్‌లో ‘కామెడీ హారర్‌’ అంటున్నారేంటి అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు మతలబు. రొటీన్‌గా ప్రతి హారర్‌ కామెడీ సినిమాలోనూ దెయ్యాలను చూసి మనుషులు భయపడుతారు.

కానీ, ఇందులో మనుషులను చూసి దెయ్యాలు భయపడతాయట! రెగ్యులర్‌ ఫార్ములాకి రివర్స్‌లో పూర్తి వినోదాత్మక చిత్రమిది. ‘పాఠశాల’ ఫేమ్‌ మహి వి.రాఘవ్‌ ఈ కొత్త జానర్‌ను తెలుగుకి పరిచయం చేయబోతున్నారు. ‘భలే మంచిరోజు’ నిర్మాతలు విజయ్‌కుమార్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి ఈ సినిమాను నిర్మించనున్నారు. ఆల్రెడీ తాప్సీకి కథ చెప్పడం, ఆమె అంగీకరించడం జరిగాయి. తాప్సీ ముఖ్యతారగా నటించనున్న ఈ సినిమాలో జయప్రకాశ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ‘వెన్నెల’ కిశోర్, ‘షకలక’ శంకర్‌లు కీలక పాత్రలు చేయనున్నారు. ‘‘ఈ నెల 22న తాప్సీ హైదరాబాద్‌ వస్తారు. దర్శకుడితో ఆమె తన లుక్‌ గురించి డిస్కస్‌ చేయడంతో పాటు సినిమాకి సంతకం చేస్తారు’’ అని సమాచారం.

ఆత్మలు, దెయ్యాలు మనుషులను భయపెట్టడమనేది ప్రతి హారర్‌ కామెడీ సినిమాలోనూ చూస్తున్నాం. బట్‌ ఫర్‌ ఏ ఛేంజ్‌... మనుషులను చూసి దెయ్యాలు, ఆత్మలు భయపడితే?  తాప్సీ ముఖ్యతారగా ‘పాఠశాల’ ఫేమ్‌ మహి వి.రాఘవ్‌ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా మూలకథ ఇదేనట!!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి