కాకతీయుడు వస్తున్నాడు

23 Jun, 2019 06:22 IST|Sakshi
తారకరత్న

తారకరత్న హీరోగా వి. సముద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాకతీయుడు’. లగడపాటి శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ముగిశాయి. ఇటీవల సెన్సార్‌ పూర్తయింది. ‘‘సముద్ర దర్శకత్వంలో పలు విజయవంతమైన చిత్రాలు రూపొందాయి. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైన్మెంట్‌ కంటెంట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది. జూలై రెండోవారంలో సినిమా విడుదలకు ప్లాన్‌ చేస్తున్నాం’’ అని నిర్మాత అన్నారు. ‘‘తారకరత్న బాడీ లాంగ్వేజ్‌కి సరిపడే కథా, కథనాలతో ఈ చిత్రం రూపొందింది’’ అన్నారు సముద్ర.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు