ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కథ

29 Jul, 2013 07:04 IST|Sakshi
ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కథ
 అతనో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. పరిశోధనల్లో మునిగి తేలే అతగాడు ప్రేమలో పడతాడు. ఓవైపు వృత్తి, మరోవైపు ప్రేమ.. ఇవే అతని జీవితం. అలాంటి యువకుడి జీవితంలో జరిగిన సంఘటనలేంటి? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘యామిని చంద్రశేఖర్’. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా తారకరత్న నటించారు.
 
  ఛాయాగ్రాహకుడు రమణ సాళ్వ దర్శకత్వంలో ముప్పా క్రాంతి చిత్ర పతాకంపై ముప్పా అంకమ్మరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. పంచి బొరా కథానాయిక. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘తారకరత్న పాత్ర చిత్రణ ఆసక్తికరంగా ఉంటుంది. ప్రేమ నేపథ్యంలో సాగే సైంటిఫిక్ థ్రిల్లర్ ఇది’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ-‘‘ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. ఆగస్టులో పాటలను, చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. 
 
 అనూప్ తేజ్, నాజర్, సుమన్, లాస్య, అదుర్స్ రఘు, బీరం మస్తాన్‌రావు, శశి తదితరులు నటించిన ఈ చిత్రానికి సమర్పణ: ముప్పా తిరుమలరాయచౌదరి, సహనిర్మాత: డా. లింగా శ్రీనివాసరావు, సంగీతం: యోగేశ్వరశర్మ, వందేమాతరం శ్రీనివాస్, పాటలు: సిరివెన్నెల, రామజోగయ్యశాస్త్రి, కృష్ణ చిన్ని.