థ్రిల్‌ అండ్‌ ఫన్‌

21 Oct, 2018 00:43 IST|Sakshi

‘అర్జున్‌రెడ్డి’ చిత్రంతో ఒక్కసారిగా బాక్సాఫీస్‌ దగ్గర బంపర్‌ హిట్‌ సాధించారు హీరో విజయ్‌ దేవరకొండ. ‘గీత గోవిందం’ చిత్రం ఆ ఫీట్‌ను కంటిన్యూ చేసింది. ఇదే ఫీట్‌ను ‘టాక్సీవాలా’ చిత్రంతో రిపీట్‌ చేయటానికి  రెడీ అయ్యారు విజయ్‌. జిఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రాహుల్‌ సంకృత్యాన్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ, ఎస్‌.కె.ఎన్‌ నిర్మిస్తున్నారు. ‘‘సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ కథాంశంతో హిలేరియస్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాం.

ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నవంబర్‌ 16న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రబృందం తెలిపింది. ఇంకా చిత్రవిశేషాలను ఎస్‌.కె.ఎన్‌. చెబుతూ– ‘‘విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని, తన ఇమేజ్‌కి తగ్గట్టుగానే అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసే విధంగా రాహుల్‌ ఈ సినిమాను తీర్చిదిద్దారు. విజయ్‌ బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్, మేనరిజమ్స్‌ యూత్‌ని ఆకట్టుకుంటాయి. ఈ చిత్రంలో గ్రాఫిక్స్‌ చాలా కీలకంగా ఉంటాయి. అందుకే విడుదల కాస్త ఆలస్యమైంది’’ అన్నారు. ప్రియాంకా జవాల్కర్, మాళవికా నాయర్, కళ్యాణి, మధునందన్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: జేక్స్‌ బిజాయ్‌.

మరిన్ని వార్తలు