నిన్ను ప్రేమించాను..కానీ నువ్వు బాకీ పడ్డావు!

17 Mar, 2015 09:36 IST|Sakshi
నిన్ను ప్రేమించాను..కానీ నువ్వు బాకీ పడ్డావు!

లాస్ ఏంజిల్స్: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. కానీ నువ్వు నాకు బాకీ పడ్డావు అంటూ హోయలు ఒలకబోస్తోంది హాలీవుడ్ గాయని, నటి టేలర్ స్విఫ్ట్ . ఇదేదో ఆమె ప్రేమికుడు మధ్య జరిగిన సంభాషణ కాదండోయ్. తన పెంపుడు జంతువు పిల్లితో టేలర్ అన్న మాటలు. ఈ మధ్య తన కాళ్లను భారీ మొత్తంలో బీమా చేయించిన వార్తలు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై వస్తున్న వరుస కథనాలకు ఫుల్ స్టాప్ పెట్టింది టేలర్. తన పెంపుడు పిల్లి టేలర్ కాళ్లపై గాయం చేసిన కారణంగానే బీమా చేయించాల్సి వచ్చిందని తాజాగా వివరణ ఇచ్చింది.. 'నేను నిన్ను ప్రేమిస్తున్నా.. అయినా నువ్వు నా కాళ్లపై గాయం చేశావు. నువ్వు నాకు రూ.250 కోట్లు(40 మిలియన్ డాలర్లు) బాకీ పడ్డావు'అంటూ తన పెంపుడు పిల్లిని ఉద్దేశించి గారాలు పోతోంది టేలర్.

 

అయితే తన కాళ్ల విలువ రూ. 60 కోట్లు వరకూ ఉంటుందని తొలుత భావించినా.. సదరు ఇన్సురెన్స్ కంపెనీ ఆ కాళ్లకు రూ.250 కోట్ల బీమా చేసింది. ఇంకేముంది ఆ అందమైన కాళ్లకు అంత మొత్తంలో ఇన్సురెన్స్ దక్కడంతో ఆ నటి ఆనందానికి అవధుల్లేవు. ప్రస్తుతం టేలర్ తన నటించిన'1989' సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రపంచవ్యాప్త పర్యటనకు సిద్దమవుతోంది.