అమ్మే నా తొలి గురువు : శ్రీయ

4 Sep, 2016 23:20 IST|Sakshi
అమ్మే నా తొలి గురువు : శ్రీయ

 టీచర్స్ డే స్పెషల్
 చిన్నప్పట్నుంచీ చదువులో నేను యావరేజ్ స్టూడెంటే. డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే.. చిన్నప్పుడు ఓసారి అమ్మతో కలసి గుడికి వెళ్లాను. అక్కడ జరుగు తున్న డ్యాన్స్ ప్రోగ్రామ్ చూసి అమ్మ చేతిని వదిలేసి అటు వెళ్లా. జనాలు గుంపులు గుంపులుగా ఉన్నారు. నేను కనపడకపోవడంతో అమ్మ కంగారు పడుతూ వెతికింది. చివరకు, స్టేజి మీద డ్యాన్స్ చేస్తూ కనిపించడంతో ఊపిరి పీల్చుకుంది.
 
 నాకు డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో అమ్మకు తెలిసింది. ఆ తర్వాత తనే నాకు నేర్పించింది. అమ్మే నా తొలిగురువు. డ్యాన్స్‌లో నా ప్రతిభ చూసే ఢిల్లీ ‘లేడీ శ్రీరామ్ కాలేజ్’లో సీట్ ఇచ్చారు. అమ్మతో పాటు నా స్కూల్, కాలేజీ గురువులందరూ నాకు ఆదర్శంగా నిలిచారు. ఒక్కో టీచర్‌లో ఒక్కో లక్షణాన్ని ఆదర్శంగా తీసుకున్నాను.  పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో టీచర్ల పాత్ర చాలా ఉంటుంది కాబట్టి ‘ఆచార్య దేవోభవ’.