తేజ దర్శకత్వంలో అమితాబ్‌

27 Nov, 2019 00:43 IST|Sakshi

విభిన్న కథా చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు దర్శకుడు తేజ. ఇప్పుడు తేజ దృష్టి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ‘ఆర్టికల్‌ 370’పై పడిందని తెలిసింది. ఈ అంశం ఆధారంగా ఆయన ఓ కథ రాశారని సమాచారం. ఆ కథను ఓ ప్రముఖ నిర్మాత తెరకెక్కించనున్నారట.  గోవాలో ఈ కథకు సంబంధించిన ప్రీ–ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని వినికిడి. ఈ చిత్రంలో నటించడానికి అమితాబ్‌ సుముఖంగా ఉన్నారట. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోందని ఫిలింనగర్‌ వర్గాల సమాచారం.

మరిన్ని వార్తలు