షాబాద్‌లో ‘తెలంగాణ దేవుడు’ సందడి

15 Aug, 2018 09:35 IST|Sakshi
సినీహీరో సుమన్‌తో ఎమ్మెల్యే కాలె యాదయ్య, పట్నం అవినాష్‌రెడ్డి 

షాబాద్‌(చేవెళ్ల) : షాబాద్‌ మండలంలో తెలంగాణ దేవుడు సినిమా షూటింగ్‌ శరవేగంగా కొనసాగుతోంది. మ్యాక్‌ ల్యాబ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై మహ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌ నిర్మాతగా, హరీష్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌ షాబాద్‌ మండలంలోని పోతుగల్‌ గ్రామంలో జరుగుతోంది. 1969 నుంచి 2018 వరకు తెలంగాణ చరిత్రే సినిమా కథ. ఇందులో ప్రొఫెసర్‌ జయశంకర్‌సార్‌ పాత్రలో సినీ హీరో సుమన్, చిన్నతనంలో ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ పాత్రలో నిర్మాత కుమారుడు జీషాన్‌ ఉస్మాన్‌ నటిస్తున్నారు.

1969 నుంచి తెలంగాణ ఉద్యమం, ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్, కేసీఆర్‌ పాత్రలు ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించేలా చిత్ర నిర్మాణం జరుగుతోందని నిర్మాత చెప్పారు. పోతుగల్‌ గ్రామంలో, ప్రభుత్వం పాఠశాలలో, గిరిజన తండాలో పలు సన్నివేశాలను చిత్రీకరిస్తామన్నారు. తెలంగాణ దేవుడు సినిమా షూటింగ్‌ స్పాట్‌ను చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, టీఆర్‌ఎస్‌ జిల్లా యూత్‌ అధ్యక్షుడు పట్నం అవినాష్‌రెడ్డిలు సందర్శించారు. సినిమా విశేషాలను హీరో సుమన్, చిత్రయూనిట్‌ను అడిగి తెలుసుకున్నారు.

మరిన్ని వార్తలు