పోచంపల్లి హ్యాండ్లూమ్‌ పార్క్‌లో సమంత

16 Mar, 2017 03:46 IST|Sakshi

భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండల కేంద్రం లోని హ్యాండ్లూమ్‌ పార్క్‌ను బుధవారం రాష్ట్ర హ్యాండ్లూమ్‌ అంబాసిడర్, సినీనటి సమంత సందర్శించారు. మగ్గాలపై తయారు చేసిన వివిధ రకాల ఇక్కత్‌ వస్త్రాల ను, డిజైన్లను పరిశీలించారు. కార్మికులకు లభిస్తున్న గిట్టుబాటు ధర, పార్క్‌లో ఎన్ని మగ్గాలు న్నాయి, ఎంతమంది పని చేస్తున్నా రని, మార్కెటింగ్‌ విధానాలపై ఆరా తీశారు. ఆమె వెంట నిఫ్ట్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రీతమ్‌ ఉన్నారు.

చేనేత సహకార సంఘంలో..
గుండాల: జనగామ జిల్లా గుండాల మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘాన్ని తెలంగాణ రాష్ట్ర చేనేత బ్రాండ్‌ అంబాసిడర్, సినీ నటి సమంత బుధవారం సందర్శిం చారు. సంఘంలోని వస్త్రాలను, కోముల మిషీన్‌ను పరిశీలించారు. నేత కార్మికులకు కూలి గిడుతోందా, ఆదివారం రోజున కూడా పనిచేస్తారా? అని అడిగి తెలుసుకున్నారు. చేనేత సంఘంలో ప్రస్తుతం నేస్తున్న దోమ తెరల తరహాలో చీరలను నేయాలని సూచించారు. దానికి తగిన వేతనాన్ని ప్రభుత్వపరంగా అందజేసేందుకు తాను కృషి చేస్తానని, సంఘం పనితీరు, నేత కార్మికుల నైపుణ్యాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. సమంత వెంట టెస్కో డిజైనర్లు శ్రావణ్‌కుమార్, ప్రీతమ్, పర్సనల్‌ అసిస్టెంట్‌ శషాంక, స్థానిక చేనేత సంఘం అధ్యక్షుడు దుడుక ఉప్పలయ్య, కార్యదర్శి సత్యనారాయణ, సిబ్బంది సోమయ్య, రమేశ్, గోపాల్, కార్మికులు మార్కండేయ, విఠల్, యాదగిరి, సత్తయ్య, పెంటయ్య, బుచ్చిరాములు, సోమయ్య ఉన్నారు.