వాటికి డబ్బు చెల్లించి... మోసపోవద్దు!

17 Nov, 2016 23:12 IST|Sakshi
వాటికి డబ్బు చెల్లించి... మోసపోవద్దు!

‘ది హైదరాబాద్ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్’ 1941 నవంబర్ 17న ప్రారంభమైంది. ఈ సంస్థను 2014లో ‘తెలంగాణా స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్‌గా’ మార్చారు. ఈ సంస్థకు గురువారంతో 75 ఏళ్లు (ప్లాటినం జూబ్లీ) పూర్త య్యాయి. ఈ సందర్భంగా ఆ కమిటీ అధ్యక్షుడు పి.రామ్మోహన రావు, కార్యదర్శి కె. మురళీ మోహనరావు అధ్యక్షతన కార్యవర్గ సభ్యుల సమావేశం జరిగింది. వారు మాట్లాడుతూ- ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక గుర్తింపు పొందిన సంస్థ ఇది. ఇప్పటి వరకూ 3382 మంది సభ్యులున్నారు.

తెలంగాణ ప్రభుత్వం సినీసీమకు అందించే సేవలు, లబ్ధి పొందా లంటే ఈ సంస్థలో సభ్యత్వం ఉండాలి. తెలం గాణ పేరిట ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొచ్చిన ఏ ఇతర సంస్థలకీ ప్రభుత్వ గుర్తింపు లేదు. వాటిల్లో సభ్యత్వం కోసం డబ్బు చెల్లించి మోసపోవద్దు. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ప్రభుత్వ ఉన్నతాధికారి నవీన్ మిట్టల్ దృష్టికి పలు అంశాలు తీసుకెళ్లాం’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి