తెలుగు ప్రేక్షకులను మరువలేను: కాజల్

21 Dec, 2013 10:01 IST|Sakshi
తెలుగు ప్రేక్షకులను మరువలేను: కాజల్

‘పచ్చని పొలాలు...  ఆహ్లాదం గొలిపే పర్యాటక ప్రాంతాలున్న తూర్పుగోదావరి జిల్లాకు రావడం ఇదే మొదటిసారి. కాకినాడ రావడం ఆనందంగా ఉంది. ఇక్కడి అభిమానులు నాపై చూపుతున్న ఆప్యాయత మరువలేను.’ అని ప్రముఖ సినీనటి కాజల్‌అగర్వాల్ అన్నారు. మెయిన్‌రోడ్డులో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన ‘శ్రీనికేతన్ ఉమెన్స్ షాపింగ్ వరల్డ్’ను ప్రారంభించేందుకు వచ్చిన కాజల్ మీడియాతో కొద్దిసేపు ముచ్చటించారు.  
 
 ప్ర: తూర్పుగోదావరి జిల్లా ఎలా ఉంది?
 జః చాలా బాగుంది. మళ్లీ రావాలనిపిస్తోంది
 ప్ర: కాకినాడ కాజా రుచి చూశారా?
 జః రుచి చూడలేదు. త్వరలోనే మళ్లీ వస్తా. ఈసారి తప్పకుండా కాజా తింటా.
 ప్రః తెలుగు ఇండస్ట్రీకి దూరమైనట్టున్నారు?
 జ: అబ్బే అదేం లేదు. తెలుగులో నటిస్తూనే ఉంటా. తెలుగు పరిశ్రమకు దూరమయ్యే ప్రసక్తే లేదు.
 ప్ర: బాలీవుడ్‌లో అవకాశాలు ఎలా ఉన్నాయి?
 జ : మంచి ఛాన్సులు వస్తున్నాయి. ఉత్తరాది ప్రేక్షకులు కూడా మంచి ఆదరణ చూపుతున్నారు.
 ప్రః ప్రస్తుతం ఏ సినిమాల్లోచేస్తున్నారు?
 జః ‘జో’ సినిమా విడుదలకు  సిద్ధంగా ఉంది. సంక్రాంతికి ఇది విడుదలవుతుంది. తెలుగు, తమిళ భాషల్లో మరో రెండు ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి.
 ప్ర : నటిగా మీకు బ్రేక్ ఇచ్చిన సినిమా ఏది ?
 జ : ముందు చందమామ.. ఆ తర్వాత మగధీర.. తర్వాత చాలా సినిమాలు ఉన్నాయి.
 ప్రః తెలుగులో మళ్లీ ఎప్పుడు కనిపిస్తారు?
 జః  తెలుగులో కూడా మంచి ప్రాజెక్టులు ఉంటాయి. తెలుగు ప్రజల ఆదరాభిమానాల వల్లనే ఇవాళ నేను ఈ స్థాయికి చేరుకోగలిగాను. వారిని మరువలేను.