ఎస్‌.పి. రాజారామ్‌కు దర్శకుల సంఘం నివాళి

1 Nov, 2019 06:26 IST|Sakshi
ఎస్‌.పి రాజారామ్‌

‘సమాజానికి సవాల్‌’ సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దర్శకునిగా ప్రయాణం మొదలుపెట్టారు ఎస్‌.పి రాజారామ్‌. ఈ చిత్రంలో కృష్ణ, శ్రీదేవి జంటగా నటించారు. ఆ తర్వాత తెలుగులో ‘వదినగారి గాజులు’, ‘ముద్దాయి ముద్దుగుమ్మ’ వంటి విజయవంతమైన చిత్రాలతో పాటు హిందీలో ఘర్వాలీ–బాహర్‌ వాలి, అభీ అభీ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.

అక్టోబరు 24న ఎస్‌.పి రాజారామ్‌ తుది శ్వాస విడిచారు. తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ఎస్‌.పి రాజారామ్‌కు నివాళులు అర్పిస్తూ, అసోసియేషన్‌ కార్యాలయంలో సంతాప సభ నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుల సంఘం ప్రధాన కార్యదర్శి రాంప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘ఒక సీనియర్‌ అండ్‌ సిన్సియర్‌ డైరెక్టర్‌ను తెలుగు చిత్రపరిశ్రమ కోల్పోయింది. ఆయన మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం’’   అన్నారు. దర్శకుల సంఘానికి చెందిన పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు