ఫిల్మ్‌ జర్నలిస్టుల కోసం అండగా...

4 Apr, 2020 05:31 IST|Sakshi

కరోనా వైరస్‌ ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ఫిల్మ్‌ జర్నలిస్టులకు ‘తెలుగు ఫిల్మ్‌ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌’(టీఎఫ్‌జేఏ) అండగా ఉంటుందని అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తెలిపారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 35 మంది ఫిల్మ్‌ జర్నలిస్టులకు టీఎఫ్‌జేఏ ఆధ్వర్యంలో 30 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ– ‘‘సినిమా ప్రెస్‌మీట్స్‌కి హాజరయ్యే విలేకరులకు, ఫొటో, వీడియో జర్నలిస్టులకు టీఎఫ్‌జేఏ అండగా ఉంటుంది. ఏ ఒక్కరూ కూడా ఆకలితో ఉండకూడదనేది సంస్థ ముఖ్యోద్దేశం. ఇబ్బందుల్లో ఉన్న జర్నలిస్టులు టీఎఫ్‌జేఏని సంప్రదించవచ్చు’’ అన్నారు.

మరిన్ని వార్తలు