కంచె దాటింది

29 Mar, 2016 00:29 IST|Sakshi
కంచె దాటింది

ఈ ప్రపంచం నిండా కంచెలే!
మతాల మధ్య కంచెలు...
కులాల మధ్య కంచెలు...
ప్రాంతాల మధ్య కంచెలు...
కుటుంబాల మధ్య కంచెలు...
మనసుల మధ్య కంచెలు...
ఇన్నింటికి కంచెలు కట్టినవారు
ప్రేమకు మాత్రం కట్టలేరా?

 

సినిమా అంటేనే  క్రిష్‌కు ప్రసవ వేదన. కథ కోసం వెతుకులాట...  కథ దొరికాక  ఆ కథను మరింత చిక్కబరచడం కోసం పెనుగులాట... ప్రీ-ప్రొడక్షన్‌కే బోలెడంత టైమ్ తీసుకుంటాడు క్రిష్. ‘కృష్ణం వందే జగద్గురుమ్’ తర్వాత హిందీ ‘గబ్బర్’ టైమ్‌లో క్రిష్‌ని హాంట్ చేయడం మొదలు పెట్టిందో కాన్సెప్ట్. అదీ సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో. సెకండ్ వరల్డ్ వార్ గురించి వరల్డ్ లెవల్‌లో సినిమాలొచ్చాయి కానీ, ఇండియాలో ఎవరూ ఎటెంప్ట్ చేయలేదు. క్రిష్‌కి ఈ థాట్ రావడంతోనే పులకించిపోయాడు. దానికి తోడు ప్రేమకు కంచె కట్టడమనేది అమోఘమైన ఆలోచన. అటు సెకండ్ వరల్డ్ వార్- ఇటు లవ్ వార్ ఈ రెండింటినీ మిక్స్ చేసి టూ లేయర్స్‌లో కథ ఫిక్స్ చేశాడు.ఆరు నెలలు ఈ కథ గురించే  ఆలోచన.  సీన్ బై సీన్, షాట్ బై షాట్, తనలో ఆవహించుకున్నాడు. అందుకే 55 రోజుల్లో తీసేయగలిగాడు. నిజం చెప్పాలంటే - ఇంకో ఫిలిమ్ మేకరైతే ఏడాది పైగానే తీసేవాడు.

 

‘కంచె’ మేకింగ్ కోసం నానాకష్టాలు పడ్డాడు క్రిష్.  మ్యూజియమ్స్ తిరిగాడు. గూగులంతా జల్లెడ పట్టాడు. ఆ కాలం నాటి బైక్‌లు- ట్రక్‌లు- హెల్మెట్‌లు... కొన్ని సెల్ఫ్ మేడ్. ఇంకొన్ని రెంట్‌కు. కెప్టెన్ దూపాటి హరిబాబు పాత్రకు ఒకే ఒక్క సినిమా వయసున్న వరుణ్‌తేజ్‌ను సెలక్ట్ చేసుకోవడమే క్రిష్ సాహసం. కానీ అవుట్‌పుట్ చూశాక గుడ్ సెలక్షన్ అంటారని క్రిష్‌కు ముందే తెలుసు.

 
కొత్త నెరేషన్...

సరికొత్త లొకేషన్స్... డిఫరెంట్ గెటప్స్... చిక ్కటి మాటలు... చక్కటి దృశ్యాలు... వీటన్నిటితో మనల్ని రెండో ప్రపంచయుద్ధ కాలంలోకి తీసుకెళ్లిపోయాడు.హరిబాబు- సీతల ప్రణయాన్ని ఫుల్‌గా ఆస్వాదించేలా చేశాడు.  ఇదంతా క్రిష్ క్రెడిట్. అందుకే, ఇవాళ ఈ ‘కంచె’ జాతీయ స్థాయిలో కాలరెగరేసింది! తెలుగులో ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా నిలిచింది!  క్రిష్... వియ్ సెల్యూట్ యు!!