‘ఎఫ్‌2’కు అరుదైన గౌరవం

6 Oct, 2019 15:14 IST|Sakshi

విక్టరీ వెంకటేశ్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఎఫ్‌2 (ఫన్‌ అండ్‌ ప్రస్ట్రేషన్‌)’ ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజ్‌ నిర్మించారు. ప్రతీ ఇంట్లో రెగ్యులర్‌గా జరిగే సన్నివేశాల నుంచే కామెడీ జనరేట్‌ చేసిన అనిల్‌.. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించేలా చేశాడు. తాజాగా ఈ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. 

‘ఇండియన్‌ పనోరమ’లో తెలుగు చిత్రపరిశ్రమ నుంచి ప్రదర్శన కోసం ఈ సినిమా ఎంపికైంది. 50వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) ఉత్సవాలు నవంబర్‌లో గోవాలో జరగనున్నాయి. ఈ ఫెస్టివల్‌లో ఎఫ్‌2 చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఎఫ్‌2 చిత్రం ఐఎఫ్‌ఎఫ్‌ఐ-2019 ప్రదర్శనకు ఎంపిక కావడంపై దిల్‌ రాజ్‌, అనిల్‌ రావిపూడి సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా కోసం పనిచేసిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

కాగా, వెంకటేశ్, వరుణ్‌తేజ్‌ హీరోలుగా తమన్నా, మెహరీన్‌ హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, అన్నపూర్ణ, రజిత, ప్రగతి, అనసూయ, ప్రకాశ్‌రాజ్‌, ప్రియదర్శి, రఘుబాబు ఇతర ప్రధాన పాత్రలో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా