మంచికీ చెడుకీ మధ్య పోరాటం

2 Sep, 2016 22:53 IST|Sakshi
మంచికీ చెడుకీ మధ్య పోరాటం

కన్నడంలో బాగా పేరున్న హీరోల్లో దునియా విజయ్ ఒకరు. ఆయన నటించిన ‘జయమ్మన మగ’ తెలుగులో ‘మహాబలి’ పేరుతో విడుదల కానుంది. శ్రీ జేవీ ప్రొడక్షన్స్ పతాకంపై లతా మార్టోరి సమర్పణలో పంపిణీదారుడు, నిర్మాత వెంకట్రావ్ మార్టోరి అనువదించారు. చిత్రవిశేషాలను వెంకట్రావ్ మార్టోరి తెలియ జేస్తూ - ‘‘కన్నడంలో ‘జయమ్మన మగ’ ఘనవిజయం సాధించింది. బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో సాగే కథ. మంచికీ చెడుకీ మధ్య జరిగే పోరాటం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ చిత్రానికి గ్రాఫిక్స్ ప్రత్యేక ఆకర్షణ. మంచి సస్పెన్స్ థ్రిల్లర్. అర్జున్ జన్య స్వరపరచిన పాటలు, భారతీబాబు రాసిన డైలాగ్స్ ఓ హైలైట్. ఈ నెల 6న పాటలను విడుదల చేయబోతున్నాం’’ అన్నారు.