మనస్ఫూర్తిగా సోమరాజు వీలునామా!

11 Oct, 2019 11:44 IST|Sakshi

తోలు బొమ్మలాట  మోషన్‌ పోస్టర్‌

మాటలు మళ్లీ తిరిగి వెనక్కి రావ్‌...

మనస్ఫూర్తిగా, పూర్తి ఆరోగ్యంతో సోమరాజు వీలునామా!

సాక్షి, హైదరాబాద్‌: సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌ ముఖ్యపాత్రలో నటించిన 'తోలుబొమ్మలాట' చిత్రానికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ శుక్రవారం విడుదల చేసింది. బలమైన, పదునైన  డైలాగులతో,  మానవ సంబంధాల మర్మాన్ని విప్పుతున్నట్టున్న ఈ మూవీ  పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా  ఆ నలుగురు లాంటి మూవీల ద్వారా విలక్షణ పాత్రల్లో నటుడిగా తనకంటూ ఒకప్రత్యేక స్థానాన్ని   దక్కించుకున్ననటకిరీటి డా.రాజేంద్ర ప్రసాద్‌ సోమరాజు  అలియాస్‌ సోడాల్రాజు పాత్ర ద్వారా మరోసారి ప్రశంసలు అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 

విశ్వంత్‌, వెన్నెల కిషోర్‌, హర్షిత చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌, మంచి విలువలతో విభిన్న కుటుంబ కథాచిత్రంగా వస్తున్న ఈ మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా ముగించుకుని త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదైలన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే.

సుమ దుర్గా క్రియేషన్స్‌ పతాకంపై దుర్గా ప్రసాద్‌ మాగంటి నిర్మిస్తున్న ఈ మూవీ ద్వారా విశ్వనాథ్‌ మాగంటి దర్శకునిగా పరిచయమవుతున్నారు. పక్కా గ్రామీణ వాతావరణం, గ్రామీణ కళలతోపాటు, కుటుంబం విలువలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్న ఈ ఎమోషనల్‌ డ్రామా మూవీ  థియేటర్లను పలకరించే సమయం చాలా సమీపంలోనే ఉంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా