-

సె..లవ్ అంటూ...!

30 Nov, 2015 00:25 IST|Sakshi
సె..లవ్ అంటూ...!

ఓ జంట మధ్య సాగే అందమైన ప్రేమకథగా రూపొందిన చిత్రం ‘ఇక సె..లవ్’. సాయి రవికుమార్, దీప్తి జంటగా డుంగ్రోత్ నాగరాజ్ దర్శకత్వంలో గన్నవరపు చంద్రశేఖర్, పీర్యా నాయక్, రవిగ్యార నిర్మాతలు. ఈ సినిమా టీజర్ ను నిర్మాత సి. కల్యాణ్  ఆదివారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ‘‘టైటిల్‌ను చూస్తే ఈ సినిమా కథేంటో, క్లయిమ్యాక్స్ ఏంటో తెలుస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించారు ’’ అని అన్నారు. ‘‘అన్ని వయసుల వారినీ ఆకట్టుకునే లవ్ ఎంటర్‌టైనర్ ఇది. వచ్చే నెలలోనే పాటలను, చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని దర్శకుడు తెలిపారు.  ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వి.శ్రీనివాసరెడ్డి, సంగీతం: మధు.డి.