ఆద్యంతం ఆహ్లాదకరంగా...

6 May, 2015 00:06 IST|Sakshi
ఆద్యంతం ఆహ్లాదకరంగా...

 అందమైన ప్రేమకథ నేపథ్యంలో... కుటుంబంలోని ప్రేమానుబంధాలకు అద్దం  పడుతూ రూపొందిన చిత్రం ‘అయ్యో రామా’. పవన్‌సిద్దూ, కామ్నాసింగ్ జంటగా ఆనీ క్రియేషన్స్ పతాకంపై గంటా రామకృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి కిరణ్‌కుమార్ దర్శకుడు. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ‘‘ఆద్యంతం చాలా ఆహ్లాదకరంగా ఉండేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ‘జబర్దస్త్ టీమ్’ కామెడీ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.  త్వరలో డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభిస్తాం’’ అని నిర్మాత చెప్పారు.  ఈ చిత్రానికి రచన: రాజేష్ ముదునూరు, సంగీతం: సంతోష్ కవల.