ఎలాగోలా బతికేద్దామని సిటీకొచ్చిన ‘భలే కుర్రాళ్లు’.

2 Jul, 2013 04:02 IST|Sakshi
ఎలాగోలా బతికేద్దామని సిటీకొచ్చిన నలుగురు కుర్రాళ్లు అష్టకష్టాలు పడి చివరకు ఎలా స్థిరపడ్డారు అనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘భలే కుర్రాళ్లు’. శశాంక్, వికేష్, చరణ్, బ్రహ్మా, భవ్యశ్రీ, సోనాలి, సోను, పవిత్ర ప్రధాన పాత్రధారులు. చరణ్ మల్లెల దర్శకుడు. నిర్మాత ఉప్పలపాటి వికేష్ చౌదరి మాట్లాడుతూ -‘‘సందేశంతో కూడా హాస్యకథాచిత్రమిది. ఈ నెలాఖరున పాటలను, ఆగస్ట్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. యువతరం కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిదని దర్శకుడు అన్నారు. 90 శాతం చిత్రీకరణ పూర్తయిందని సమర్పకుడు వెంకట్ చెప్పారు. పోసాని కృష్ణమురళి, సుమన్‌శెట్టి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మణికణ్ణన్, సంగీతం: ప్రేమ్‌సాగర్.