బిజీ బీజీ!

22 Sep, 2018 06:23 IST|Sakshi

సంయుక్తా హెగ్డే.. పేరు ఎక్కడో విన్నారు కదూ. కన్నడ ‘కిర్రిక్‌ పార్టీ’ సినిమాలో ఆమె చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఆ సినిమాలో ఆమె హైపర్‌కు థియేటర్స్‌లో మంచి మార్కులు పడ్డాయి. ఎంతలా అంటే.. ఈ కన్నడ ‘కిర్రిక్‌ పార్టీ’ సినిమాను తెలుగులో ‘కిర్రాక్‌ పార్టీగా’ రీమేక్‌ చేయాలనుకున్నప్పుడు సేమ్‌ రోల్‌కు సంయుక్తానే తీసుకునేంతగా. ఈ సినిమాతో తెలుగులోనూ మార్కులు కొట్టేశారామె. ఇప్పుడీ కన్నడ బ్యూటీ కోలీవుడ్‌లో బిజీ బీజీగా ఉన్నారట. ‘జయం’ రవి, కాజల్‌ ఓ తమిళ సినిమా కోసం జోడీ కట్టారు. కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో స్క్రిప్ట్‌ పరంగా సెకండ్‌ హీరోయిన్‌కు చాన్స్‌ ఉందట. దీంతో మేకర్స్‌ సంయుక్తాను సంప్రదించడం, ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం అన్నీ చకా చకా జరిగిపోయాయట. ఇది కాకుండా తమిళ సినిమా ‘పప్పీ’లో నటిస్తున్నారీ బ్యూటీ.

మరిన్ని వార్తలు