ఆన్‌లైన్‌లో ‘సాహో’ సినిమా ప్రత్యక్షం!

30 Aug, 2019 14:31 IST|Sakshi

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్‌ అడ్వంచరస్‌ థ్రిల్లర్‌ సాహో సినిమాకు పైరసీ తప్పలేదు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన కొద్దిసేపటికే ఈ సినిమా పైరసీ వీడియోను ఆన్‌లైన్‌లో పెట్టేశారు. థియేటర్లలో ప్రీమియర్‌ షో ముగిసిన తర్వాత పైరసీ వెబ్‌సైట్లలో సినిమా ప్రత్యక్షమైంది. తమిల్‌ రాకర్స్‌, పైరేట్‌ బే వంటి పలు వెబ్‌సైట్లలో ఈ సినిమా పైరసీ వీడియో పెట్టినట్టు జాతీయ మీడియా వెల్లడించింది. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాను పైరసీ చేయడం పట్ల చిత్రయూనిట్‌ ఆందోళన చెందుతోంది. మిషన్‌ మంగళ్‌, బాట్లాహౌస్‌, సేక్రేడ్‌ గేమ్స్‌-2 కూడా ఆన్‌లైన్‌లోకి లీక్‌ చేశారు. తమిళ స్టార్‌ అజిత్‌ నటించిన తాజా చిత్రం ‘నేర్కొండ పార్వై’ను విడుదలకు ముందే పైరసీ చేశారు. సింగపూర్‌లో ప్రీమియర్‌ షో తర్వాత ఈ సినిమా పైరసీ వెబ్‌సైట్లలోకి వచ్చేసింది.

కాగా, భారీ అంచనాల నడుమ విడుదలైన సాహో సినిమాపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ప్రేక్షకులను ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఆరంభ వసూళ్లు భారీగానే ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. (చదవండి: ‘సాహో’ మూవీ రివ్యూ)

మరిన్ని వార్తలు