తెలుగు టీవీ పరిశ్రమలో కరోనా కలకలం

23 Jun, 2020 19:53 IST|Sakshi
టీవీ సీరియల్‌ షూటింగ్‌(ఫైల్‌ పొటో)

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు సినిమా పరిశ్రమలో కరోనా కలకలం చోటుచేసుకుంది. ఓ సీరియల్‌లోని ముఖ్య నటుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో టీవీ సీరియల్‌ నటుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వివరాల్లోకి వెళితే.. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం టీవీ, సినిమా షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే షూటింగ్‌లు జరిపేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడంతోపాటుగా.. కొన్ని మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సీరియల్స్‌, టీవీ షోల షూటింగ్‌లు ప్రారంభమయ్యాయి. (చదవండి : ఆ జ్ఞాపకాలు షేర్‌ చేసిన అనసూయ)

ఈ క్రమంలో ఓ ప్రముఖ చానల్‌లో ప్రసారమయ్యే సీరియల్ నటుడికి కరోనా సోకింది. జ్వరం, ఇతర లక్షణాలతో బాధపడుతున్న అతడికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో నిర్మాతలు ఆ సీరియల్‌ షూటింగ్‌ను నిలిపివేశారు. యూనిట్ సభ్యులందరిని క్వారంటైన్‌కు పంపించినట్టుగా సమాచారం. కరోనా సోకిన నటుడు.. మరో చానల్‌లో ప్రసారమయ్యే సీరియల్‌లో కూడా నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ నటుడు ఇప్పటివరకు ఎవరెవరిని కలిసారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక, సినిమాల విషయానికి వస్తే.. కేవలం రెండు, మూడు చిత్రాలు మినహా షూటింగ్‌లు ప్రారంభం కాలేదు. (చదవండి : షూటింగ్‌లు స్టార్ట్‌.. యాంకర్స్‌ సందడి)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు