వర్థమాన నటుడు కమలాకర్ కన్నుమూత

13 Jul, 2013 12:05 IST|Sakshi
వర్థమాన నటుడు కమలాకర్ కన్నుమూత

చెన్నై : 'అభి' చిత్రం ద్వారా  తెలుగు తెరకు పరిచయమైన వర్ధమాన నటుడు బూచేపల్లి కమలాకర్‌ రెడ్డి ఈ ఉదయం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 37 సంవత్సరాలు. కమలాకర్‌కు భార్య ఇద్దరు పిల్లలున్నారు. కమలాకర్ రెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

అభితో పాటు సన్ని, హాసిని, సంచలనం వంటి చిత్రాల్లో కమలాకర్‌రెడ్డి హీరోగా నటించారు. ప్రస్తుతం కమలాకర్‌ నటిస్తున్న బ్యాండ్‌ బాలు చిత్రం షూటింగ్‌ పూర్తై విడుదలకు సిద్దంగా ఉంది. కమలాకర్‌ మృతి పట్ల తెలుగు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా చీమకుర్తి.  కమలాకర్ రెడ్డి  మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్ర సాద్‌రెడ్డి సోదరుడు.

 

కమలాకర్ రెడ్డి  భౌతిక కాయాన్నిచెన్నై నుంచి చీమకుర్తికి తరలించారు. కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కమలాకర్ రెడ్డి మృతిపట్ల సంతాపం తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం ఆమె కమలాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి