'టెంపర్' సెన్సార్ పూర్తి

12 Feb, 2015 20:27 IST|Sakshi
'టెంపర్' సెన్సార్ పూర్తి

చిన్న ఎన్టీఆర్ తాజా చిత్రం 'టెంపర్' సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ దక్కింది. 18 కట్స్ తో సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమాకు అనుమతి మంజూరు చేశారు. సన్నీ నియోన్ పై ఉన్న డైలాగ్ సహా పలు మాటలు 'మూట్'లోకి వెళ్లాయి. 30 శాతం క్లైమాక్స్ సీన్ తొలగించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా నిడివి మొత్తం 141 నిమిషాలున్నట్టు సమాచారం.

యాక్షన్ ఫిలిమ్ గా తెరకెక్కిన 'టెంపర్' ఫిబ్రవరి 13న విడుదలకానుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించారు. తమ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ దక్కిందని బండ్ల గణేష్ ట్విటర్ లో తెలిపారు. 'టెంపర్'ను ఆదరించాలని కోరారు. మొత్తం సినిమాను చూసేందుకు నందమూరి అభిమానులు సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

>