'నందమూరి అభిమానుల ఆకలి తీర్చే సినిమా'

28 Jan, 2015 22:09 IST|Sakshi
'నందమూరి అభిమానుల ఆకలి తీర్చే సినిమా'

హైదరాబాద్: నందమూరి అభిమానుల ఆకలి తీర్చేలా 'టెంపర్' సినిమా ఉంటుందని నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. ఫిబ్రవరి 13న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని చెప్పారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన 'టెంపర్' సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుక బుధవారం శిల్పాకళావేదికలో జరిగింది.

ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ... టెంపర్ లో కొత్త ఎన్టీఆర్ ను చూస్తారని అన్నారు. ఎన్టీఆర్ కెరీర్ లో ఈ సినిమా నంబర్వన్ గా నిలిచిపోతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ సినిమా తీసినందుకు గర్వంగా ఉందన్నారు. నందమూరి అభిమానులు కలర్ ఎత్తుకుని చెప్పుకునేలా సినిమా ఉంటుందని బండ్ల గణేష్ పేర్కొన్నారు. టెంపర్ పెద్ద విజయం సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.