రెండుగంటలు నవ్విస్తాం

15 Nov, 2019 05:20 IST|Sakshi
సందీప్‌ కిషన్, హన్సిక, జి. నాగేశ్వర రెడ్డి, సాయి కార్తీక్‌ తదితరులు

– సందీప్‌ కిషన్‌

‘‘కమర్షియల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో థ్రిల్లింగ్‌ యాక్షన్‌ డ్రామాగా ‘తెనాలి రామకృష్ణ’ చిత్రాన్ని రూపొందించాం. నాలోని ప్లస్సులను హైలెట్‌ చేసి, మైనస్‌లను కవర్‌ చేసి అద్భుతంగా ఈ సినిమా తీశారు నాగేశ్వరరెడ్డిగారు. మా చిత్రంతో రెండుగంటలపాటు ప్రేక్షకులను నవ్విస్తాం’’ అని సందీప్‌ కిషన్‌ అన్నారు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో సందీప్‌ కిషన్, హన్సిక జంటగా నటించిన చిత్రం ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’. జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో అగ్రహారం నాగిరెడ్డి, శ్రీనివాస్, కె.సంజీవ్‌ రెడ్డి నిర్మించిన  సినిమా నేడు విడుదలవుతోంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ–‘‘సందీప్‌ కిషన్‌ సినిమా పిచ్చోడు. తనకు సినిమా తప్ప మరేం తెలియదు. ఈ చిత్రాన్ని నిర్మాతలు ప్యాషన్‌తో నిర్మించారు. టీమ్‌ అందరం కష్టపడి ఈ సినిమా చేశాం.. ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘మా సినిమా అందర్నీ అలరిస్తుంది’’ అన్నారు హన్సిక. ‘‘ఈ చిత్రాన్ని తమిళంలోనూ రీమేక్‌ చేస్తాం’’ అన్నారు నిర్మాతలు.  రచయిత రాజసింహా, నటుడు ప్రభాస్‌ శ్రీను, సంగీత దర్శకుడు సాయి కార్తీక్‌ మాట్లాడారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు