సరిగమల సమావేశం

24 Jun, 2019 06:11 IST|Sakshi
త్రివిక్రమ్, తమన్, అల్లు అర్జున్‌

అనుకున్న సమయానికి చిత్రీకరణను పూర్తి చేయాలని అల్లుఅర్జున్‌ అండ్‌ టీమ్‌ నాన్‌స్టాప్‌గా వర్క్‌ చేస్తున్నట్లున్నారు. అటు సన్నివేశం.. ఇటు పాటలను ఒకేసారి కంప్లీట్‌ చేసే పనిలో పడ్డారు. అల్లుఅర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే, నివేతాపేతురాజ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. టబు, సుశాంత్‌ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతున్నట్లు తెలిసింది. హీరో హీరోయిన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరోవైపు అల్లుఅర్జున్, త్రివిక్రమ్‌లతో కలిసి మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ వేశారు తమన్‌. అక్కడి ఫొటోను షేర్‌ చేస్తూ– ‘‘మా సినిమా మ్యూజిక్‌ మంచి ప్రాసెస్‌లో, స్పీడ్‌ ప్రోగ్రెస్‌లో ఉంది’’ అని తమన్‌ పేర్కొన్నారు. మరి... వీరి సరిగమల సమావేశం శ్రోతలను ఎంతలా ఆకట్టుకుంటాయో చూడాలంటే కాస్త ఓపికపట్టాల్సిందే.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా