మా జీవితంలో ఆనందం లేదు : హీరోయిన్‌

4 Mar, 2018 10:37 IST|Sakshi
తమన్నా

తమిళసినిమా: మాది ఆడంబర జీవితమే కానీ ఆనందం లేదు అంటోంది నటి తమన్నా.  తమిళం మాత్రమే కాకుండా, తెలుగు, హింది భాషల్లోనూ కథానాయకిగా వెలుగొందుతున్న తమన్నా అంటున్న మాటలు తారలు సంతోషంగా లేరన్నదే. తమన్నా ఏమంటుందో చూద్దాం. నటీమణులు అనగానే సుఖ జీవనం అని అపోహ చాలా మందిలో ఉంది. తమ జీవితాలు సమస్యల మయం అని వారికి తెలియడం లేదు. 

నటీమణులెవ్వరూ ఇక్కడ పరిపూర్ణ సంతోషాన్ని అనుభవించడం లేదు. రేయనక పగలనక షూటింగ్‌లో పాల్గొంటున్నాం. ఒక్క నిమిషం కూడా విశ్రమించకుండా శ్రమిస్తున్నాం. షూటింగ్‌ స్పాట్‌లో షాట్‌ రెడీ అని పిలవగానే వెళ్లి నిలబడాలి. మనసులో ఎలాంటి కష్టనష్టాలున్నా, అవి బయట పడకుండా నటించాలి. సొంత పనులకు కూడా సమయాన్ని కేటాయించలేని పరిస్థితి. కాసేపు కుటుంబంతో కలిసి గడపాలని ఆశించినా కుదరదు.

ఇష్టమైన ఆహారాన్ని కూడా తినలేం. అందాన్ని కాపాడుకోవడానికి కసరత్తులు చేయాలి. శరీర సౌష్టవాన్ని నాజూగ్గా ఉంచుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణ అమ్మాయిలను చూసినప్పుడు నేను వారిలా స్వేచ్ఛగా జీవించలేకపోతున్నాననే బాధ కలుగుతుంది. అయితే సినిమాలో సంతోషమే లేదని చెప్పను గానీ, మేము చాలా త్యాగాలు చేస్తున్నామన్నది ఇతరులు గ్రహించాలి. సినిమాల్లో కొనసాగడానికి, అవకాశాల కోసం పరితపించాల్సి ఉంటుంది. ఇక్కడ దర్శకుడే కెప్టెన్‌. వాళ్లు చెప్పినట్లు నటించాల్సిందే అని అంటోంది నటి తమన్నా. పెద్దలు ఊరికే అనలేదు తారల జీవితం అద్దాల మేడ అని. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు