ఆ సినిమా రీమేక్ ఆగిపోయింది

6 Feb, 2016 13:01 IST|Sakshi
ఆ సినిమా రీమేక్ ఆగిపోయింది

అవును.. తనీఒరువన్ సినిమా రీమేక్ చేయాలనే ప్రయత్నాలు ఆగిపోయాయి. తమిళ్లో ఘనవిజయం సాధించిన ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలోనూ రీమేక్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే తెలుగులో ఈ సినిమా రీమేక్ యథాతథంగా కొనసాగుతుండగా, బాలీవుడ్ రీమేక్ మాత్రం ఆగిపోయింది. సల్మాన్ హీరోగా తెరకెక్కాల్సిన ఈ ప్రాజెక్ట్పై కండలవీరుడు పెద్దగా ఇంట్రస్ట్ చూపించకపోవటంతో ఆగిపోయింది.

తమిళ్లో తనీఒరువన్ సినిమాకు దర్శకత్వం వహించిన మోహన్ రాజా తన దర్శకత్వంలోనే హిందీలో తెరకెక్కించాలని ప్రయత్నించాడు. సల్మాన్ కూడా తనీఒరువన్ రీమేక్లో నటించడానికి ముందు ఆసక్తిగా ఉన్నా.. తర్వాత మాత్రం కాదన్నాడు. ముఖ్యంగా కథలో ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోవటం, ఇప్పట్లో సల్మాన్ డేట్స్ కూడా ఖాళీ లేకపోవటంతో ఈ రీమేక్ ఆగిపోయింది. సినిమా ఆగిపోయిన విషయాన్ని స్వయంగా ప్రకటించకపోయినా, త్వరలోనే వేరే సినిమా మొదలవుతుందంటూ దర్శకుడు మోహన్ రాజా ప్రకటించటంతో తనీఒరువన్ బాలీవుడ్ రీమేక్ ఆగిపోయిన విషయం కన్ఫమ్ అయ్యింది.