సినిమాల్లో హీరోగా భువనగిరి గణేష్‌

19 Nov, 2019 08:52 IST|Sakshi
తను క్లాస్‌మెంట్‌  సినిమాలో గణేష్‌

సాక్షి, భువనగిరి(నల్గొండ) : సినీ హీరో కావాలనే లక్ష్యంతో ఓ యువకుడు విభిన్న పాత్రలు పోషిస్తూ అందరి చేత శభాష్‌ అనిపించుకుంటున్నాడు. ఇందుకోసం అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని లఘుచిత్రాల్లో సైడ్‌హీరోగా నటించి అనంతరం హీరోగా నటించాడు. ప్రస్తుతం టీవీ సీరియల్‌లో విభిన్నపాత్రలు పోషిస్తున్నాడు. భువనగిరి మండలం బండసోమారం గ్రామానికి చెందిన సుర్పంగ రాములు, లక్ష్మి దంపతుల కుమారుడు గణేష్‌. చిన్నప్పటి నుంచి సినిమాలో నటించాలనే సంకల్పంతో ఆదిశగా ప్రయత్నాలు చేస్తుండేవాడు. ఎప్పటికైనా సినిమాలో హీరోగా నటించాలనే కోరిక అతడిలో కలిగింది. అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుండేవాడు. ఈక్రమంలోనే యాదగిరిగుట్టకు చెందిన లఘుచిత్ర దర్శకుడు రాజు గణేష్‌లో ఉన్న నటన ప్రతిభను గుర్తించి అవకాశం కల్పించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు విశ్రాంతి లేకుండా లఘుచిత్రాల్లో నటిస్తూ ప్రస్తుతం టీవీ సీరియల్‌లో సైతం నటిస్తున్నాడు. 

ప్రస్తుతం టీవీ సీరియళ్లలో..
గణేష్‌ ప్రారంభంలో రియల్‌ లవ్‌ నెవర్‌ డై, ల్యాజిక్‌ ఆఫ్‌ లైవ్‌ డిషిసన్, రెండు లఘు చిత్రాల్లో నటించాడు. ఈచిత్రా లు 2013లో విడుదలయ్యాయి. వీటితోపాటు బర్త్‌డే బాయ్‌ చిత్రం కూడా నటించాడు. ఆ తర్వాత వదిలేసి వెళ్తున్నా, సైలెంట్‌ లవ్‌ స్టోరీ, కాలేజీ పొరగాళ్లు, శాంతాభాయ్, నాకు నీనే తోపు తురుము, తను క్లాస్‌మెంట్‌ వంటి చిన్న సినిమాల్లో విభిన్న పాత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఇందిరానో కంప్రమైజ్‌ సినిమాలో నటిస్తున్నాడు. వీటితోపాటు బంగారు పంజారం, మనస్సు మమత వంటి టీవీ సీరియల్‌లలో నటించాడు.

సినీ హీరో కావాలన్నదే నా కోరిక 
అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. లఘుచిత్రంతో ప్రారంభమైన నా చిన్న సినిమాల వరకు తీసుకువచ్చాను. ప్రస్తుతం టీవీ సీరియళ్లలో నటిస్తున్నాను. పెద్ద సినిమాల్లో అవకాశం వస్తే తప్పనిసరిగా నటిస్తా. జీవితంలో హీరోగా ఒక సినిమాలో నటించాలని నా కోరిక. 
– గణేష్, నటుడు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు