‘నీకు మాత్రమే చెప్తా’నంటోన్న తరుణ్‌ భాస్కర్‌

12 Mar, 2020 19:27 IST|Sakshi

‘నీకు మాత్రమే చెప్తా’ షోతో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నానంటున్నాడు తరుణ్‌ భాస్కర్‌. పీపీ ప్రొడక్షన్స్‌లో తెరకెక్కుతున్న ఈ కార్యక్రమానికి ప్రజా ప్రభాకర్‌, శ్రీకాంత్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శరత్‌ డైరెక్ట్‌ చేస్తున్నారు. ఇప్పటివరకు దర్శకుడిగా, నటుడిగా కనిపించిన ఆయన తాజాగా వ్యాఖ్యాతగా అవతారం ఎత్తాడు. ఈ ప్రోగ్రామ్‌ మొదటి ఎపిసోడ్‌ ఈ నెల 14న ఓ టీవీ చానల్‌లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తరుణ్‌ భాస్కర్‌, శరత్‌, నిర్మాతలు ప్రభాకర్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

నిర్మాత ప్రజా ప్రభాకర్‌ మాట్లాడుతూ.. ‘ఒక సినిమా వెనుక, ఒక డైరెక్టర్‌ వెనుక ఎంత కష్టం ఉంటుంది అనేది ఈ షోలో చూపించాం. ముందుగా ఈ కాన్సెప్ట్ చెప్పగానే ఒప్పుకున్న తరుణ్ భాస్కర్‌కు ధన్యవాదాలు. మార్చి 14 నుంచి ‘నీకు మాత్రమే చెప్తా’ మొదలుకానుంది.  డైరెక్టర్ అవ్వకముందు తాను పడిన కష్టాలు ఈ ప్రోగ్రామ్‌లో ఎంటర్‌టైన్‌ విధానంలో చెప్పాం. దర్శకుడు శరత్ మాట్లాడుతూ... నిర్మాత శ్రీకాంత్ ఒకరోజు ఈ కాన్సెప్ట్ చెప్పి డైరెక్ట్ చెయ్యమన్నారు. అలా నన్ను నమ్మి ఈ ప్రోగ్రామ్ నాతో డైరెక్ట్ చేయించినందుకు థ్యాంక్స్. షూట్ సమయంలో తరుణ్ భాస్కర్ బాగా ఎంకరేజ్ చేశారు. నా డైరెక్షన్ టీమ్ బాగా సపోర్ట్ చేసింది. వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా’నని పేర్కొన్నారు. (ప్రతి ఒక్కరి ఫోన్‌లో కచ్చితంగా ఒక సీక్రెట్‌ ఉంటుంది)

వాళ్ల మీద అభిప్రాయాలు మారాయి
తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ... నన్ను ఆదరిస్తూ వస్తున్న వారందరికోసం మరో కొత్త ప్రయత్నంతో మీ ముందుకు వస్తున్నాను. ఒక డైరెక్టర్ మరో డైరెక్టర్‌ను ఇంటర్వ్యూ చెయ్యడం అనే కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. బుల్లితెరపై ప్రోగ్రామ్ చెయ్యడంతో చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. శనివారం నుంచి ప్రసారం కాబోతున్న ‘‘నీకు మాత్రమే చెప్తా’’ షో నన్ను చాలా మార్చింది, ఈ షో ప్రభావం మీ మీద కూడా ఉంటుందని అనుకుంటున్నాను. నాకు ఇతర డైరెక్టర్ల మీద ఉన్న అభిప్రాయాలు చాలా వరకు మారాయి. నిర్మాతలు శ్రీకాంత్, ప్రభాకర్ ఈ కాన్సెప్ట్‌తో మా దగ్గరికి రావడం.. అది నాకు నచ్చడంతో ఈ షో వెంటనే ప్రారంభించాం. 

ఇది ఫస్ట్ సీజన్, ఇప్పటివరకు కొన్ని ఎపిసోడ్స్ షూట్ చేశాము. సక్సెస్ ఫుల్ దర్శకులతో పాటు రీసెంట్‌గా విజయాలందుకున్న కొత్త దర్శకులను కూడా ఈ ప్రోగ్రామ్‌లో పరిచయం చేయబోతున్నాము. నేను వెంకటేష్ గారితో చేయబోయే ప్రాజెక్ట్ త్వరలోనే మొదలవుతుంది. ఇది సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరకెక్కుతుంది. నేను నెట్ ఫ్లిక్స్‌కు చేసిన వెబ్ సిిరీస్ చాలా బాగా వచ్చింది. అందులో మంచు లక్ష్మి ఓ ఇంపార్టెంట్ రోల్ చేశారు. ఈ సిరీస్‌తో మేఘనా శాన్వి అనే కొత్తమ్మాయి ఇంట్రడ్యూస్ అవుతుంది. తను చాలా బాగా చేసింది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవుతుంది. నేను ఔట్ పుట్ తో చాలా హ్యాపీగా ఉన్నాను’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు