అందులో నా స్వార్థం కూడా ఉంది – అల్లు అరవింద్‌

20 Sep, 2017 13:06 IST|Sakshi
అందులో నా స్వార్థం కూడా ఉంది – అల్లు అరవింద్‌

‘‘మా గీతా ఆర్ట్స్‌తో పాటు యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్‌ సంస్థలతో కలిసి ‘వి4 క్రియేషన్స్‌’ అనే కొత్త సంస్థని స్టార్ట్‌ చెయ్యడంలో నా స్వార్థం కూడా ఉంది. యంగ్‌స్టర్స్‌తో కలిసి ఉంటే వాళ్లు ఎలా ఆలోచిస్తున్నారు అనేది అర్థమవుతుంది. తద్వారా అప్‌డేటెడ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు కొత్త తరహా సినిమాలు తీసే వీలుంటుంది’’ అని నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. ఆది, వైభవీ శాండిల్య, రష్మీ గౌతమ్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో యాంకర్, నటుడు ప్రభాకర్‌ దర్శకత్వంలో వి4 క్రియేషన్స్‌పై ‘బన్నీ’ వాసు నిర్మించిన ‘నెక్ట్స్‌ నువ్వే’ ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. అల్లు అరవింద్‌ మాట్లాడుతూ– ‘‘కొత్త బేనర్‌ని స్టార్ట్‌ చెయ్యడానికి కారణం ఏంటని అందరూ అడుగుతున్నారు. ఏ నిర్మాతైనా తను నమ్మిందే కరెక్ట్‌ అని సిన్మాలు తీస్తూ వెళితే కొన్నాళ్లకు సినిమాలు తియ్యకుండా ఆగిపోతారు.

మారుతున్న ట్రెండ్‌కి తగ్గట్టుగా సినిమాలు తీస్తేనే కంటిన్యూ అవ్వగలుగుతాం. వి4లో మూడు బేనర్‌లే ఉన్నాయి. నాలుగోది బేనర్‌ కాదు. ఫ్రెష్‌ థాట్స్, యునీక్‌ సబ్జెక్ట్స్‌తో వచ్చేవారు నాలుగోవారు అవుతారు’’ అన్నారు. ‘‘నవంబర్‌ 3న సిన్మాను రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ‘‘ఆదితో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నాం’’ అని జ్ఞానవేల్‌ రాజా అన్నారు. ‘‘నేనీ సినిమా డైరెక్ట్‌ చేశానంటే కారణం అల్లు శిరీష్‌. టాలెంట్‌ని ఎంకరేజ్‌ చెయ్యడంలో శిరీష్‌ ముందుంటారు. మంచి సినిమా తీశానన్న తృప్తి కలిగింది’’ అన్నారు ప్రభాకర్‌. నటుడు సాయికుమార్, దర్శకుడు మారుతి, వైభవి, సంగీత దర్శకుడు సాయికార్తీక్, యూవీ క్రియేషన్స్‌ వంశీ, ప్రమోద్‌ పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా