ఆ సంతకం ప్రత్యేకం

6 Jun, 2014 23:27 IST|Sakshi

అన్ని దానాల్లోకెల్లా విద్యా దానం గొప్పదంటారు. బతికున్నప్పటి వరకూ ఆ దానం ఓకే. కానీ, మరణించిన తర్వాత ఏం చేయగలుగుతాం?... ఇటీవల శిల్పాశెట్టి మనసుని తొలిచేసిన ప్రశ్న ఇది. ఆ ప్రశ్నకు సమాధానం కూడా కనుక్కున్నారామె. మరణించిన తర్వాత కూడా ఏదో రూపంలో జీవించాలంటే అవయవ దానం చేయడం మంచిదని నిర్ణయించుకున్నారు శిల్పా. అది కూడా ఈ అందమైన ప్రపంచాన్ని చూడ్డానికి నోచుకోలేనివారికి చూపు ఇస్తే బాగుంటుంది కదా అనుకున్నారు.
 
ఈ నేపథ్యంలో ఓ స్వచ్ఛంద సంస్థకు ‘నేత్రదానం’ చేసే విషయమై ఒప్పంద పత్రంలో సంతకం పెట్టారు శిల్పాశెట్టి. ఇప్పటివరకూ ఎన్నో సంతకాలు పెట్టానని, కానీ ఈ సంతకం ఇచ్చిన సంతృప్తి వేరే ఏదీ ఇవ్వలేదని తన సన్నిహితుల దగ్గర శిల్పా చెప్పారట.