అందుకు సహకరించండి ప్లీజ్‌!

16 Jun, 2017 01:40 IST|Sakshi
అందుకు సహకరించండి ప్లీజ్‌!

ప్లీజ్‌ సహకరించరూ అంటున్నారు నటి సమంత. ఈ చెన్నై బ్యూటీ ఒక పక్క చేతి నిండా చిత్రాలు, దగ్గర పడుతున్న పెళ్లి గడియలతో చాలా బిజీగా ఉన్నారు. టాలీవుడ్‌ యువ నటుడు నాగచైతన్యతో సమంత ప్రేమ వ్యవహారం సక్సెస్‌ అయిన విషయం తెలిసిందే. వీరి పెళ్లి ముహూర్తం కూడా ఖరారైంది. ఈ వివాహం హిందూ, క్రిస్టియన్‌ల సంప్రదాయ పద్ధతిలో రెండు సార్లు జరగనుంది. అక్టోబర్‌ ఆరో తేదీన నాగచైతన్య, సమంతల వివాహ వేడుక ఘనంగా జరగనుందన్న విషయం విదితమే.

కాగా సమంత చేతి నిండా చిత్రాలతో చాలా బిజీగా ఉన్నారు. తమిళంలో విజయ్‌తో ఒక చిత్రం, విశాల్‌కు జంటగా ఇరుంబుతిరై చిత్రాలతో పాటు అనీతి కథైగళ్‌ అనే మరో చిత్రంలోనూ నటిస్తున్నారు.అదే విధంగా తెలుగులోనూ రెండు చిత్రాలు చేస్తున్నారు. ఇవి కాకుండా తమిళంలో శివకార్తికేయన్‌తో జత కట్టడానికి అంగీకరించారు. వీటిలో ప్రస్తుతం విజయ్‌తో చేస్తున్న చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. కాగా శివకార్తికేయన్‌తో రొమాన్స్‌ చేయనున్న చిత్రం ఈ నెల 18వ తేదీన ప్రారంభం కానుంది.

ఇన్ని చిత్రాల్లో నటిస్తున్న సమంత పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న తరుణంలో తాను నటిస్తున్న దర్శక నిర్మాతలకు ఒక విజ్ఞప్తి చేశారట. అదేమిటంటే తాను నటిస్తున్న చిత్రాల్లో తన పాత్రలకు సం బంధించిన సన్నివేశాలను మూడు నెలల్లో పూర్తి చేయాలని కోరుతూ ప్లీజ్‌ అర్థం చేసుకుని సహకరించండి అం టూ విజ్ఞప్తి చేస్తున్నారట. అక్టోబర్‌ 6వ తేదీన పెళ్లి జరగనుండడంతో సెప్టెంబర్‌ కల్లా ప్రస్తుతం ఒప్పుకున్న చిత్రాలను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారట. వివాహానంతరం రెండునెలల పా టు సినిమాలకు దూరంగా ఆ జీవిత మాధుర్యాన్ని అనుభవించి ఆ తరువాత షరామామూలుగా నటనపై దృష్టి పెడతారట.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా