ప్రేమ కోసం పోరాటం

5 Mar, 2015 23:29 IST|Sakshi
ప్రేమ కోసం పోరాటం

వైజాగ్ ఏరియా పంపిణీదారునిగా చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్న రాజు తనయుడు సత్య కార్తీక్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘టిప్పు’. వారియర్ ఆఫ్ లవ్ అనేది ఉపశీర్షిక. జగదీష్ దానేటి దర్శ కత్వంలో ఆదిత్య ఫిలింస్ పతాకంపై డీవీ సీతారామరాజు ఈ చిత్రం నిర్మించారు. గురువారం హైదరాబాద్‌లో ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. వైజాగ్ సత్యా నంద్‌గారి దగ్గర శిక్షణ పొందిన సత్య కార్తీక్‌కి హీరోగా మంచి భవిష్యత్తు ఉందని ఈ సందర్భంగా కేయస్ రామారావు అన్నారు.

సత్య కార్తీక్ మన పక్కింటి అబ్బాయిలా ఉన్నాడు కాబట్టి, అందరికీ దగ్గరవుతాడనీ తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. ఈ ప్రచార చిత్రం చాలా బాగుందని సి. కల్యాణ్ చెప్పారు. సినిమాలంటే సత్య కార్తీక్‌కి చాలా ఇష్టమని దర్శకుడు వీయన్ ఆదిత్య పేర్కొన్నారు. హీరోగా తన పరిచయ చిత్రానికి మంచి కథ కుదిరినందుకు సత్య కార్తీక్ సంతోషం వెలి బుచ్చారు. ఈ నెలాఖరున పాటలనూ, వచ్చే నెల చిత్రాన్నీ విడుదల చేస్తామని నిర్మాత చెప్పారు. ఈ చిత్రా నికి కెమెరా: రాజ శేఖర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శివరామి రెడ్డి.