‘ఉలవచారు బిర్యానీ’ వడ్డించనున్న స్నేహ

16 Jul, 2013 04:43 IST|Sakshi
‘ఉలవచారు బిర్యానీ’ వడ్డించనున్న స్నేహ
 ‘ఆవకాయ బిర్యాని’ పేరుతో ఓ సినిమా వచ్చింది. ఇప్పుడు కొత్తగా ‘ఉలవచారు బిర్యానీ’ రాబోతోంది. ఉలవచారు ఏంటో, బిర్యానీ ఏంటో, ఈ రెండింటి కలయిక ఏంటో ప్రకాష్‌రాజే చెప్పాలి. ఎందుకంటే  ఈ ఉలవచారు బిర్యానీని తయారు చేసేది ఆయనే కాబట్టి. ఆయన దర్శకత్వంలో ఈ సినిమా రూపకల్పనకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవలే ఆయన ‘ధోనీ’ సినిమా డెరైక్ట్ చేసిన సంగతి తెలిసిందే. 
 
 మలయాళంలో ఘన విజయం  సాధించిన ‘సాల్ట్ అండ్ పెప్పర్’ ఆధారంగా ప్రకాష్‌రాజ్ ఈ సినిమా చేయబోతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రూపొందనున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా స్నేహను ఎంపిక చేసుకున్నారట. పెళ్లి తర్వాత సినిమాలకు కొంత విరామం ఇచ్చిన స్నేహ, తన సెకండ్ ఇన్నింగ్స్‌ని ‘ఉలవచారు బిర్యానీ’తో మొదలుపెట్టబోతున్నారు. రెండు తరాల అంతరం నేపథ్యంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తయారు కానుంది.