ఫోన్ చేతిలో ఉందని... ఫొటో తీసేయడమేనా?

21 Jun, 2015 00:17 IST|Sakshi
ఫోన్ చేతిలో ఉందని... ఫొటో తీసేయడమేనా?

ఒకప్పుడు ఫోన్ నాలుగు గోడలకు పరిమితం. ఇప్పుడు ఎక్కడికెళితే, అక్కడకు తీసుకెళ్లొచ్చు. ముచ్చటగా ఏదైనా దృశ్యం కనిపిస్తే, ఆ ఫోన్‌లో ఉన్న కెమెరాతో బంధించొచ్చు. కానీ, తీయకూడనవి తీస్తే? కొన్ని జీవితాలు ఇబ్బందులపాలవుతాయ్. మలయాళ ‘దృశ్యం’ చిత్రంలో చెప్పిన పాయింట్ ఇదే.
 
 ఈ చిత్రం తమిళ రీమేక్ ‘పాపనాశం’లో కమల్‌హాసన్, గౌతమి నటించారు. ఈ సందర్భంగా మొబైల్ ఫోన్ గురించి కమల్ ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ఏది పడితే అది తీసే హక్కు ఉందని కొంతమంది అనుకుంటున్నారు. ఎదుటి వ్యక్తి మనోభావాలతో సంబంధం లేకుండా ఫొటోలు తీస్తున్నారు’’ అని కమల్ అన్నారు.
 
 ఓ సెలబ్రిటీగా ఇలాంటి సంఘటనలు నాకు చాలా ఎదురయ్యాయని కమల్ చెబుతూ -‘‘సెలబ్రిటీలతో ఫొటోలు దిగాలని అందరికీ ఉంటుంది. కానీ, వాళ్ల అనుమతి తీసుకోవాలి. కొంతమంది నా దగ్గరకు వచ్చి, ఫొటో తీసేస్తారు. ఆ తర్వాత ‘ఫొటో తీసుకోవచ్చా?’ అంటారు. వింతగా ఉంటుంది’’ అన్నారు.