త్వరలో డెరైక్షన్!

26 Apr, 2016 00:49 IST|Sakshi
త్వరలో డెరైక్షన్!

‘తని ఒరువన్’ సినిమాలో స్టయిలిష్ విలన్‌గా కనిపించిన మాజీ హీరో అరవింద్ స్వామి ఈ చిత్రం తెలుగు రీమేక్‌లోనూ అదే  పాత్ర చేస్తున్నారు. మరో పక్క ‘డియర్ డాడ్’ అనే చిత్రంతో హిందీలో రీ-ఎంట్రీ ఇస్తున్నారాయన. ఇన్నాళ్లు వ్యాపారంలో బిజీబిజీగా ఉన్న అరవింద్‌స్వామి ఇప్పుడు పూర్తిగా సినిమాల మీదే దృష్టి సారించనున్నారు. నటుడిగా మాత్రమే కాదు.. డెరైక్షన్ కూడా చేయాలనుకుంటున్నారు. ‘‘ఇప్పటికే నా చేతిలో రెండు స్క్రిప్టులున్నాయి. ఈ ఏడాదిలోనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కిస్తా. అయితే అది హిందీలోనా...లేక తమిళంలోనా? అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేను’’ అని వెల్లడించారాయన.

కాలానుగుణంగా మారుతున్న ప్రేక్షకుల అభిరుచి గురించి అరవింద్ స్వామి మాట్లాడుతూ- ‘‘ప్రేక్షకులు రొటీన్ ఐడియాలను తిప్పికొడుతున్నారు. వాళ్లు సినిమాలు చూసే విధానంలో మార్పు వచ్చింది. కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అందుకే రకరకాల ప్రయోగాలతో సినిమాలు తీయడానికి ఆస్కారం దొరుకుతోంది’’ అని వ్యాఖ్యానించారు.