శ్యామ్‌ చిత్రానికి రాఘవ లారెన్స్‌ ప్రశంస

16 Jul, 2017 02:52 IST|Sakshi
శ్యామ్‌ చిత్రానికి రాఘవ లారెన్స్‌ ప్రశంస

తమిళసినిమా: నటుడు శ్యామ్‌ చిత్రాన్ని నృత్యదర్శకుడు లాఘవలారెన్స్‌ ప్రశంసించారు. నటుడు శ్యామ్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ప్రేక్షకాదరణ ఉందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బహుభాషా నటుడైన ఆయన తాజాగా నటిస్తున్న ద్విభాషా చిత్రం కావియం. తెలుగులో వాడొస్తాడు పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్యామ్‌కు జంటగా నటి అద్వియ నటిస్తున్నారు.


శ్రీదేవికుమార్, శ్రీనాథ్‌  ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఇందులో జస్టిన్‌ వికాశ్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. 2ఎం.సినిమాస్‌ పతాకంపై కేవీ.శబరీష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సారథి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రం గురించి ఈ సందర్భంగా ఈయన తెలుపుతూ కావియం చిత్రం థ్రిల్లర్‌గా సాగే విభిన్న కధా చిత్రం అని చెప్పారు. ఎస్‌ఎన్‌.రాజేశ్‌కుమార్‌ ఛాయాగ్రహణం, శ్యామ్‌మోహన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ను నటుడు, నృత్యదర్శకుడు లారెన్స్‌ శుక్రవారం ఆవిష్కరించినట్లు తెలిపారు. చిత్ర మోషన్‌ పోస్టర్‌తో పాటు, ట్రైలర్‌ను చూసిన లారెన్స్‌ చాలా బాగున్నాయంటూ ప్రశంసించారని దర్శకుడు తెలిపారు.