ఆ పవర్‌ మనుషులకొస్తే...

27 Jul, 2017 00:42 IST|Sakshi
ఆ పవర్‌ మనుషులకొస్తే...

‘‘శాస్త్రవేత్త లేదా తత్వవేత్తల గమ్యం ఒక్కటే. సైన్స్, ఫిలాసఫీ ఒకదానితో అనుసంధానమై ఉన్నాయి’’ అన్నారు చల్లా శ్రీకాంత్‌. ఆయన దర్శకత్వంలో ఐఐటి ఐఎస్‌ఎమ్‌డి, ఐఐఎమ్‌బిలలో చదివిన పలువురు విద్యార్థులు కలసి నిర్మించిన (క్రౌడ్‌ ఫండెడ్‌) సినిమా ‘వశం’. వాసుదేవ్‌ రావు, శ్వేతా వర్మ జంటగా నటించిన ఈ సినిమాను వచ్చే నెల 4న విడుదల చేయాలనుకుంటున్నారు.

చల్లా శ్రీకాంత్‌ మాట్లాడుతూ– ‘‘ఏం చేయకుండా ఎదుటి వ్యక్తిని కంట్రోల్‌ చేసే పవర్‌ మనకు వస్తే... వశపరుచుకో గలిగితే ఏం చేయొచ్చు? అనేది చిత్రకథ. ఉదాహరణకు... రెండొందల ఏళ్ల క్రితం విమానాల్లో ప్రయాణించొచ్చని, కరెంట్‌తో బల్బ్‌ వెలిగించొచ్చని చెబితే మేజిక్‌ అనేవారు. అలాగే, ఇప్పుడు పర్టిక్యులర్‌ యోగాతో, సంగీతంతో, కొన్ని కెమికల్స్‌తో ఎదుటివ్యక్తి మైండ్‌ను కంట్రోల్‌ చేయొచ్చని చెబితే మేజిక్‌ అంటారు. కరెంట్‌ను కనిపెట్టినప్పుడు... నేను చెప్పేది కూడా సాధ్యం కావొచ్చు కదా. ఈ చిత్రం పోస్టర్‌ను శ్రీకాంత్, ‘అల్లరి’ నరేశ్‌ గార్లు ఆవిష్కరించారు. ట్రైలర్‌ కూడా చూసి, అభినందించారు’’ అన్నారు. ఈ చిత్రానికి కథ: రోహిత్‌ మిశ్రా, స్క్రీన్‌ప్లే: రోహిత్‌ మిశ్రా–చల్లా శ్రీకాంత్, కెమెరా: దుర్గా కిశోర్, సంగీతం: జోశ్యభట్ల శర్మ.