చిరంజీవి పోలికలు రావడం అదృష్టం..

18 Jun, 2018 10:19 IST|Sakshi

హీరో సాయి ధరమ్‌ తేజ్‌

ఘనంగా తేజ్‌ ఐ లవ్‌ యూ ఆడియో విజయోత్సవం

పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణ) : శ్రేయ మీడియా ఆధ్వర్యంలో నగరంలోని ఓ హోటల్‌లో సినీ నటుడు సాయిధరమ్‌తేజ్‌ కథానాయకుడిగా నటించిన ‘తేజ్‌ ఐ లవ్‌యూ’ చిత్రం ఆడియో విజయోత్సవ సభను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కథానాయకుడు సాయిధరమ్‌తేజ, కధానాయకి అనుపమ పరమేశ్వరన్, నిర్మాత కె.ఎస్‌.రామారావు, దర్శకుడు ఎ.కరుణాకరన్‌ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. తేజ్‌ ఐ లవ్‌యూ ఓ కలర్‌ఫుల్‌ లవ్‌ స్టోరీ అని దర్శకుడు కరుణాకరన్‌ చెప్పారు.

సాయిధరమ్‌ తేజ్‌..: కలర్‌ఫుల్‌ లవ్‌ స్టోరీ
మేనమామ చిరంజీవి పోలికలు రావడం అదృష్టం. ఆయనలా నటిస్తున్నానని అభిమానులు చెబుతున్నపుడు ఆనందంగా ఉంటుంది. ఆయన్ని అనుకరించకుండా నటిస్తున్నాను.

చిత్రం సక్సెస్‌ను దేని ఆధారంగా నిర్ణయిస్తున్నారు..
యూ ట్యూబ్, ట్విట్టర్‌లోని సందేశాలు, సినిమాలోని పాటలను రింగ్‌ టోన్స్‌గా డౌన్‌లోడ్‌ చేసుకోవడం, వివిధ సెంటర్లలోని కలñక్షన్‌ వంటి పలు అంశాల ఆధారంగా చిత్ర విజయాన్ని నిర్ణయించడం జరుగుతుంది.

చిత్రంలో మీ పాత్ర..
పార్ట్‌టైం ఉద్యోగం చేస్తూ కళాశాల విద్యార్థిగా చదువుకునే పాత్ర. సకుటుంబ సమేతంగా సినిమా చూసి ఆనందించేలా దర్శకుడు చిత్రాన్ని నిర్మించాడు. దర్శకుడు, నిర్మాత నాకు మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించారు.

ఇష్టమైన హీరోలు, హీరోయిన్లు..
ప్రభాస్, వెంకటేష్‌లు నా అభిమాన హీరోలు. సమంత నా ఫేవరేట్‌ హీరోయిన్‌. సమంతకు వివాహం అయిపోయినా అభిమానానికి వివాహానికి సంబంధం లేనందువల్ల ఆమెను నా ఫేవరేట్‌ కథానాయికనే చెబుతాను.

తరువాత చిత్రం..
మైత్రి మూవీ బ్యానర్‌ మీద త్వరలోనే కొత్త చిత్రం రాబోతుంది.

విశాఖతో మంచి అనుబంధం : అనుపమ పరమేశ్వరన్‌..
విశాఖపట్నంతో మంచి అనుబంధం ఉంది. ఇక్కడి సముద్రతీర అందాలంటే చాలా ఇష్టం. విశాఖ వచ్చినపుడల్లా చాలాబాగా ఎంజాయ్‌ చేస్తాను. ఆడియో విజయోత్సవ సభ సందర్భంగా విశాఖ రావడం ఆనందంగా ఉంది.

తేజ్‌ ఐలవ్‌యూ చిత్రం అనుభవం
తేజ్‌ ఐ లవ్‌యూ చిత్రం మంచి అనుభవాన్ని ఇచ్చింది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. కథానాయకుడు సాయిధరమ్‌తేజతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. సినిమా చూస్తున్నంత సేపు మంచి సినిమాను చూస్తున్నామన్న ఫీలింగ్‌ ఉంటుంది. కథానాయకుడు రామ్‌తో కలిసి నటిస్తున్న సినిమా షూటింగ్‌ ప్రస్తుతం కాకినాడ పరిసరాల్లో జరుగుతోంది. ఆగస్టులో విడుదలవుతుంది.

తొలిప్రేమ సమయంలో విశాఖ వచ్చా... : దర్శకుడు.. ఎ.కరుణాకరణ్‌
మెగా కుటుంబం తోటలో నేనొక చెట్టును మాత్రమే. నాకు ఆ కుటుంబంతో సాన్నిహిత్యం చాలా ఉంది. తొలిసారిగా పవన్‌ కల్యాణ్‌లో తొలిప్రేమ చిత్రానికి దర్శకత్వం వహించాను. ఇప్పుడు సాయిధరమ్‌తేజ నటించిన చిత్రానికి దర్శకత్వం వహించాను. ఇది నాకు పదో సినిమా.తొలి ప్రేమ చిత్రం షూటింగ్‌ సమయంలో లొకేషన్స్‌ చూసేందుకు విశాఖపట్నం తొలిసారిగా వచ్చాను. స్టీల్‌ప్లాంట్, రుషికొండ, భీమిలి వంటి ప్రాంతాలన్నీ తిరిగాను. చివరకు సినిమా హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకొంది.

తేజ్‌ ఐ లవ్‌యూ కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రం
తేజ్‌ ఐ లవ్‌యూ సినిమా సకుటుంబంగా చూడగలిగే మంచి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. కలర్‌ఫుల్‌ లవ్‌ స్టోరీ. తొలిప్రేమ చిత్రంలో కథానాయికతో ఎలా హైలైట్‌ సీన్స్‌ను క్రియేట్‌ చేశామో అదే విధంగా ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు అనుభూతినిస్తాయి. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తప్పక ఆదరిస్తారని నమ్ముతున్నాను.

ప్రేమ కథల స్పెషలిస్ట్‌ కరుణాకరన్‌
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు) : కరుణాకరన్‌ ఈ పేరు చెబితే ప్రేమికుల్లో వైబ్రేషన్స్‌ మొదలవుతాయని..ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్‌ కరుణాకరన్‌ అని సినీ నటుడు సాయి ధరమ్‌ తేజ్‌ అన్నారు. సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రంలో ఆదివారం సాయి ధరమ్‌ తేజ్, అనుపమ పరమేశ్వరన్‌ నటించిన తేజ్‌ ఐ లవ్‌ యూ చిత్రం ఆడియో విజయోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తేజ్‌ మాట్లాడుతూ వైజాగ్‌తో తెలియని అనుబంధం ఏర్పడిందన్నారు. నటనకు ఓనమాలు దిద్దుకున్నది ఇక్కడే. కె.ఎస్‌. రామారావు నిర్మాణ సారధ్యంలో నటించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ గోపిచంద్ర చాలా మంచి పాటలు అందించారన్నారు. మంత్రి గంటా శ్రీనివాస రావు మాట్లాడుతూ  వైజాగ్‌కు సినిమా పరిశ్రమకు ఒక సెంటిమెంట్‌గా మారిందన్నారు.

జాగ్‌లో షూటింగ్‌ల అనుమతులకు త్వరలోనే సింగిల్‌ విండో పద్ధతిని ప్రవేశపెట్టనున్నామన్నారు. హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ మాట్లాడుతూ ఉన్నది ఒక్కటే జిందగీ చిత్రంతో వైజాగ్‌తో లవ్‌ పడ్డానని అన్నారు. డైరెక్టర్‌ కరుణకర్‌ మాట్లాడ్లుతూ మా సినిమా పాటలను ఆదరించిన ప్రేక్షకులకు «కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తేజ్‌కు విలువైన వాచ్‌ను నిర్మాత కేఎస్‌ రామారావు బహుమతిగా అందజేశారు. సింగర్‌ సింహా తన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ గోపి చంద్ర తదితరులు పాల్గొన్నారు.

 (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు