శ్రీదేవి.. దివ్యభారతి.. ఓ మిస్టరీ!

25 Feb, 2018 17:30 IST|Sakshi

న్యూఢిల్లీ : మనకాలపు అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణం యావత్‌ భారతీయ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంత పరిచింది. దుబాయ్‌లో జరుగుతున్న ఓ కుటుంబ వేడుకలో పాల్గొన్న ఆమె తీవ్ర గుండెపోటు రావడంతో అకస్మాత్తుగా కుప్పకూలారు. యావత్‌ అభిమానుల్ని శోకసంద్రంలో ముంచుతూ ఆమె దివ్యలోకాలకు ఏగారు.

ఆమె హఠాన్మరణం.. ఒకప్పటి ప్రముఖ నటి దివ్యభారతిని గుర్తుకుతెస్తోంది. రూపురేఖల విషయంలో శ్రీదేవితో దగ్గరి పోలికలు ఉన్న దివ్యభారతి 19 ఏళ్ల వయస్సులో అనుమానాస్పద పరిస్థితుల నడుమ కన్నుమూశారు. ఆమె మరణం ఒక మిస్టరీగా మారింది. నిజానికి 90వ దశకంలో శ్రీదేవి వెండితెరపై వెలిగిపోతున్న సమయంలోనే దివ్యభారతి చిత్రసీమలోకి ఆరంగేట్రం చేశారు. అప్పట్లో అందరూ దివ్యభారతిని శ్రీదేవి చెల్లెలు అంటూ పిలిచేవారు.

ఒకానొక దశలో శ్రీదేవి స్థానాన్ని దివ్యభారతి తన నటనతో, అందంతో భర్తీ చేస్తుందని భావించారు. కానీ, ఆమె అకాల మృతి చిత్ర పరిశ్రమను నివ్వెరపోయేలా చేసింది. షాకింగ్‌ విషయమేమిటంటే దివ్యభారతి పుట్టినరోజు తేదీకి సమీపంలోనే శ్రీదేవి కన్నుమూయడం. 1974 ఫిబ్రవరి 25న దివ్యభారతి జన్మించింది. దివ్యభారతి పుట్టినతేదీకి ఒక రోజు ముందు దుబాయ్‌లో శ్రీదేవి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

90వ దశకంలో దివ్యభారతి వరుస సినిమాలతో బాలీవుడ్‌లో ప్రభంజనం సృష్టించింది. కొన్ని నెలల వ్యవధిలోనే ఆమె వరుస సినిమాలు బాలీవుడ్‌ను ముంచెత్తాయి. అనతికాలంలో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. కేవలం మూడేళ్ల బాలీవుడ్‌ కెరీర్‌లో దివ్యభారతి 13 సినిమాలు చేసింది. అన్ని దాదాపు భారీ బడ్జెట్‌ సినిమాలే. కానీ, 1993లో ఏప్రిల్‌ 5న దివ్యభారతి మద్యంమత్తులో (?) తన బాల్కనీ నుంచి దురదృష్టవశాత్తు పడిపోయి ప్రాణాలు విడిచింది. ఆమె మిస్టిరీయస్‌ మృతితో ఆమె ఒప్పుకొని సంతకం చేసిన పలు సినిమాల పరిస్థితి సందిగ్ధంలో పడింది. అంతకుముందే దివ్యభారతి ‘లాడ్లా’ సినిమాలో చాలావరకు నటించింది. అయితే, ఆమె చనిపోవడంతో ఆమె స్థానంలో శ్రీదేవిని లీడ్‌రోల్‌లోకి తీసుకున్నారు. అనిల్‌ కపూర్‌, శ్రీదేవి, రవీనా టాండన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘లాడ్లా’ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయింది. ఆ సమయంలో శ్రీదేవి, దివ్యభారతి ఒకరికొకరు ప్రత్యామ్నాయం అని బాలీవుడ్‌ దర్శక నిర్మాతలు భావించేవారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘సైరా’లో ఆ సీన్స్‌.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలేనట

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

‘వాల్మీకి’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

‘నా కొడుకు నా కంటే అందగాడు’

కేటీఆర్‌ బర్త్‌డే.. వారికి చాలెంజ్‌ విసిరిన ఎంపీ

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌

బిగ్‌బాస్‌.. వాళ్లిద్దరి మధ్య మొదలైన వార్‌!

ఘనంగా స్మిత ‘ఎ జ‌ర్నీ 1999-2019’ వేడుక‌లు

‘గిది సిన్మార భయ్‌.. సీన్ చేయకండి’

'అత్యంత అందమైన వీడియో ఇది'

ఇస్రో ప్రయోగం గర్వకారణం: ప్రభాస్‌

నాని ‘గ్యాంగ్‌ లీడర్’ వాయిదా?

విక్రమ్ సినిమాపై బ్యాన్‌!

ఎన్టీఆర్‌కు జోడిగా అమెరికన్‌ బ్యూటీ!

కమల్‌ సినిమాలో చాన్సొచ్చింది!

రొమాంటిక్‌ మూడ్‌లో ‘సాహో’

షుగర్‌లో త్రిష, సిమ్రాన్‌..!

పెన్‌ పెన్సిల్‌

వ్యూహాలు ఫలించాయా?

ఇస్మార్ట్‌... కాన్సెప్ట్‌ నాదే!

ఒక ట్విస్ట్‌ ఉంది

వెబ్‌ ఎంట్రీ?

రాజా చలో ఢిల్లీ

తమిళ నిర్మాతల వల్ల నష్టపోయా

ముద్దులు పెడితే సినిమాలు నడుస్తాయా?

సూర్యకు నటన రాదనుకున్నా!

ఫస్ట్‌రోజే ఫిట్టింగ్‌ పెట్టిన బిగ్‌బాస్‌

‘స్టన్నింగ్‌గా మహేష్‌ ఆర్మీ లుక్‌’

ఆసక్తికరంగా ‘సిరివెన్నెల’ ట్రైలర్‌

ఎంట్రీతోనే ట్రోల్స్‌కు కౌంటర్‌ ఇచ్చిన నాగ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సైరా’లో ఆ సీన్స్‌.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలేనట

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

‘నా కొడుకు నా కంటే అందగాడు’

కేటీఆర్‌ బర్త్‌డే.. వారికి చాలెంజ్‌ విసిరిన ఎంపీ

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌

బిగ్‌బాస్‌.. వాళ్లిద్దరి మధ్య మొదలైన వార్‌!