అతనితో అసౌకర్యం అనిపించలేదు: బిపాషా బసు

10 Jan, 2015 17:26 IST|Sakshi
అతనితో అసౌకర్యం అనిపించలేదు: బిపాషా బసు

ముంబై: కరణ్ సింగ్ గ్రోవర్తో కలసి హాట్ హాట్ సన్నివేశాల్లో నటించడానికి తాను ఎలాంటి ఇబ్బందీ పడలేదని బాలీవుడ్ బామ బిపాషా బసు చెబుతోంది. బిపాషా, కరణ్ నటించిన హర్రర్, రోమాంటిక్ సినిమా 'అలోన్' బిపాషా, కరణ్ ఘాటైన సన్నివేశాల్లో నటించారు. ఇటీవల విడుదలైన అలోన్ ట్రైలర్ యూ ట్యూబ్లో హల్ చల్ చేస్తోంది. భూషన్ పటేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది.

ఈ సినిమాలో బిపాషా అవిభక్త కవలలుగా నటించారు. అలోన్తో శృంగార సన్నివేశాల్లో నటించడానికి తనకు ఎలాంటి సమస్యా అనిపించలేదని బిపాషా చెప్పారు. కేరళలో షూటింగ్ చిత్రీకరణకు వెళ్లేముందు అతనితో ఏర్పడిన స్నేహమే దీనికి కారణమి అంది. కాగా అవిభక్త కవలలుగా నటించడానికి కష్టపడ్డానని బిపాషా చెప్పింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి