తిప్పరా మీసం

13 Oct, 2019 00:22 IST|Sakshi
శ్రీవిష్ణు

అనుకున్నది సాధించినప్పుడో, పందెంలో గెలిచినప్పుడో మీసం తిప్పుతారు. ఇప్పుడు శ్రీవిష్ణు కూడా మీసం తిప్పుతున్నారు. మరి ఆయనేం చేశారో సినిమా చూసి తెలుసుకోవాలి. శ్రీవిష్ణు హీరోగా ఎల్‌. కృష్ణ విజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తిప్పరా మీసం’. నికీ తంబోలీ హీరోయిన్‌.  శ్రీ ఓం బ్యానర్‌ సమర్పణలో రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్, కృష్ణ విజయ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్లు నిర్మించిన ఈ చిత్రాన్ని నవంబర్‌ 8న విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తయ్యాయి. ట్రైలర్, ఆడియోను త్వరలోనే రిలీజ్‌ చేస్తాం. థియేట్రికల్‌ రైట్స్‌ను ఏషియన్‌ సినిమాస్‌ బ్యానర్‌ తీసుకున్నారు’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: సురేశ్‌ బొబ్బిలి, కెమెరా: సి«ద్‌.

మరిన్ని వార్తలు