శత్రువు కూడా వ్యసనమే

7 Sep, 2019 06:19 IST|Sakshi

‘మందు, సిగరెట్, అమ్మాయిలా.. శత్రువు కూడా వ్యసనమే.. ఆ వ్యసనానికి నేనూ బానిసనే’ అంటూ శ్రీవిష్ణు చెప్పే డైలాగ్‌తో ‘తిప్పరా మీసం’ చిత్రం టీజర్‌ విడుదలైంది. శ్రీవిష్ణు, నిక్కీ తంబోలి జంటగా కృష్ణ విజయ్‌.ఎల్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్, కృష్ణ విజయ్‌ ఎల్‌ ప్రొడక్షన్, శ్రీ ఓం సినిమా పతాకాలపై రూపొందుతోన్న ఈ సినిమా టీజర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘యాక్షన్‌ రివెంజ్‌ డ్రామాగా రూపొందుతోన్న చిత్రమిది. మా సినిమా టీజర్‌కు, శ్రీవిష్ణు డైలాగ్‌కి అనూహ్య స్పందన వస్తో్తంది. శ్రీవిష్ణుని కృష్ణ విజయ్‌ ఆవిష్కరించిన తీరు, లుక్‌ అందర్నీ ఆకట్టుకుంటోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: ఖుషీ, అచ్యుత్‌ రామారావు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మనోజ్‌ మావిళ్ల, సంగీతం: సురేశ్‌ బొబ్బిలి, కెమెరా: సిద్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు